Share News

వనమహోత్సవాన్ని ఉద్యమంలా చేపట్టాలి

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:30 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్పీ క్వార్టర్స్‌ సమావేశ మందిరంలో వన మహోత్సవ కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు.

వనమహోత్సవాన్ని ఉద్యమంలా చేపట్టాలి

కరీంనగర్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం జడ్పీ క్వార్టర్స్‌ సమావేశ మందిరంలో వన మహోత్సవ కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీఆర్డీవో, అటవీ, ఎక్సైజ్‌, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, వివిధశాఖల అధికారులకు నిర్దేశించిన లక్ష్యాన్ని వారంరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించాలన్నారు. వారంరోజుల్లోగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు.

ఫ పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

గ్రామాలు, పట్టణాలు అందంగా తీర్చిదిద్దడంలో పారిశుధ్య కార్మికుల సేవలు అద్భుతమని, వారి సేవలను వెలకట్టలేమని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. గురువారం పారిశుధ్య కార్మికుల క్షేమం.. గౌరవం అనే కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రసంగించారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, స్థానిక సంస్థల నిధుల నుంచి బీమా చేస్తామని చెప్పారు. కార్మికులు రక్షణ కవచాలు ధరించి పనిచేయాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌, డీఎఫ్‌వో బాలమణి, యూనిసెఫ్‌ స్టేట్‌ ప్రతినిధి ఫణీందర్‌కుమార్‌, డీపీవో రవీందర్‌, డీఆర్డీవో శ్రీధర్‌, యూనిసెఫ్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ కిషన్‌స్వామి, ఎస్‌ఎస్‌ఎన్‌ వేణు, జిల్లా వ్యవసాధికారి శ్రీనివాస్‌, ఉద్యనవన అధికారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఫ వసతి గహాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి

కరీంనగర్‌ రూరల్‌: వసతి గృహల్లో ఉండే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కరీంనగర్‌ మండలం దుర్శేడ్‌ గ్రామంలోని ప్రభుత్వ బాలుర ఎస్సీ వసతి గృహాన్నీ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులతో మాట్లాడారు. రీడింగ్‌ రూమ్‌, వంటగది, పడుకునే గదులను పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులున్నారో అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన బోజనం పెట్టాలని ఏ సమస్య ఉ న్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ హమీద్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 12:30 AM