ఓసీపీ-2ని సందర్శించిన డైరెక్టర్
ABN , Publish Date - Nov 11 , 2024 | 12:45 AM
సింగరేణి ఆర్జీ- 3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-2ని సింగరేణి డైరెక్టర్(ఈ అండ్ఎం) సత్యనారాయణరావు సందర్శించారు.
రామగిరి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): సింగరేణి ఆర్జీ- 3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-2ని సింగరేణి డైరెక్టర్(ఈ అండ్ఎం) సత్యనారాయణరావు సందర్శించారు. ప్రాజెక్టు క్వారీని వ్యూపాయింట్ ద్వార పరిశీలించారు. యంత్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. భద్రతతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా సాదించా ల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట ఆర్జీ-3 జీఎం సుధాకర్ రావు, అధికారులు విజ యశేఖర్బాబు, చంద్రశేఖర్, రామారా వు, కొల శ్రీనివాస్ పాల్గోన్నారు.
యైుటింక్లయిన్‌కాలనీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఆర్జీ-2 పరిధిలోని ఓసీపీ -3 ప్రాజెక్టు స్టోర్స్‌ను ఆదివారం సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యనారాయణ తని ఖీ చేశారు. స్టోర్స్‌లోని రిసీట్ సెక్షన్లో ఉన్న మెటీరియల్‌ను తనిఖీ చేశారు. అన్ని సెక్షన్లలో మెటీరియల్ స్టాక్, విడిభాగా ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. యంత్రాల మరమ్మ తులకు అసరమయ్యే విడిభాగాలు అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకోవాలని, విడిభాగాల వివరాలు క్రమ పద్ధతిలో రికార్డు మెయింటన్చేయాలని సిబ్బందికి డైరెక్టర్ సత్యనారాయణ సూచించారు. వెంట డీజీఎం స్టోర్స్ డేవిడ్, డీవైఎస్ఈ సత్యనారాయణ ఉన్నారు.