ఒత్తిళ్లతో పని చేయలేక పోతున్నాం..
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:58 PM
సర్వేల పేరిట తమను తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని మండల వ్యవసాయ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. చామనపల్లిలో రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరై నిరసన తెలిపారు.
కరీంనగర్ రూరల్, అక్టోబరు 1: సర్వేల పేరిట తమను తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని మండల వ్యవసాయ శాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. చామనపల్లిలో రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా క్లస్టర్‌లోని ఒక ఏఈవో ఐదు నుంచి ఎనిమిది గ్రామాలు, ఆరు వేల నుంచి 10వేల ఎకరాలు సర్వే చేయడం కష్టమన్నారు. డీసీఎస్ సర్వే కోసం గ్రామ స్థాయిలో ఒక సంచాలకుడిని నియమించాలని కోరారు. పలు సమస్యలపై రాష్ట్ర స్థాయి అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి బి సత్యం, ఏఈవోలు స్వర్ణలత, పైడితల్లి, టి సుచిత, ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు.
శంకరపట్నం: రాష్ట్ర వ్యవసాయ విస్తరణాధికారుల జేఏసీ పిలుపు మేరకు మండలంలోని ఏఈవోలు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహించడం చాలా కష్టతరంగా ఉందన్నారు. అధికారులు ఈ సర్వే చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నందున నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుతున్నామన్నారు.