Share News

సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:20 AM

ప్రజాస్వామ్య పరిరక్షణకు, మత రాజకీయాలకు వ్యతిరేకంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్య దర్శి తాండ్ర సదానందం అన్నారు.

సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలి

పెద్దపల్లి కల్చరల్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ప్రజాస్వామ్య పరిరక్షణకు, మత రాజకీయాలకు వ్యతిరేకంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్య దర్శి తాండ్ర సదానందం అన్నారు. కమ్యూనిస్టు పార్టీ శతజయంతి ఉత్సవాల సందర్భం గా గురువారంజిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో పార్టీ జెండాను జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంద సంవత్స రాల వ్యవధిలో కమ్యూనిస్టు పార్టీ ఎన్నో పోరాటాలు చేసి విజయాలను సాధించిందన్నా రు. సీపీఐని 1925 డిసెంబరు 26న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌లో స్థాపించారని, నాటి స్వతంత్ర ఉద్యమం నుంచి నేటి తెలంగాణ ఉద్యమం వరకు వీరోచితంగా పోరా డింది కమ్యూనిస్టులేనన్నారు. కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, పదవులు ఉన్నా లేకున్నా ప్రతినిత్యం ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారం కోసం పోరా డిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందని, దీనికి పార్లమెంటులో హోం మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా హోం మంత్రి జాతికి క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని, లేకుంటే సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీ నెరవే ర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కోడం స్వామి, అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఆరెపల్లి మానస్‌ కుమార్‌, సీపీఐ పట్టణ కార్యదర్శి చంద్రగిరి ఉదయ్‌, అంజి, సహాయ కార్యదర్శి కళ్లేపల్లి శంకర్‌, ఓదెలు, నవీన్‌, లక్ష్మణ్‌, శంకర్‌, బండారి సదానందం, రవి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ్‌నగర్‌, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రజా పోరాటంలో సీపీఐ ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ నగర కార్యదర్శి కే కనకరాజు అన్నారు. సీపీఐ శతజయంతి ఉత్సవాల సందర్భం గా గురువారం గోదావరిఖని భాస్కర్‌ రావు భవన్‌, చౌరస్తాలో జరిగిన జెండా విష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీపీఐ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు కార్మికుల, కర్షకుల పక్షాన పోరాటం చేస్తోందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం పోరా డిన ఏకైక పార్టీ సీపీఐ అన్నారు. పట్టణం లో ఎల్‌బీనగర్‌, లెనిన్‌నగర్‌, ఫైవింక్లయి న్‌, బస్టాండ్‌, పవర్‌హౌస్‌కాలనీ, జనగా మ, కూరగాయల మార్కెట్‌లో సీపీఐ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ నాయకులు గోషిక మోహ న్‌, మడ్డి ఎల్లయ్య, కే స్వామి, తాళ్లపల్లి మల్లయ్య, ఆరెపల్లి పోషం, మార్కపురి సూర్య, ఓదమ్మ, రమేష్‌కుమార్‌, చంద్రశేఖర్‌, ప్రీతం, విజయ, నర్మద, అబ్దుల్‌ కరీం, జగన్‌ పాల్గొన్నారు. కాగా, సీపీఐ శత ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా గురువారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భాస్కర్‌రావు భవన్‌ నుంచి ఎర్ర జెండాలతో సీపీఐ నగర కార్యదర్శి కనకరాజు ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లతో ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ గోదావరిఖని చౌరస్తా వరకు కొనసాగింది.

Updated Date - Dec 27 , 2024 | 12:20 AM