Share News

కటింగ్‌ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం..

ABN , Publish Date - Nov 10 , 2024 | 12:53 AM

కటిం గ్‌ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.

కటింగ్‌ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం..

పెద్దపల్లి రూరల్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కటిం గ్‌ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని అప్పన్నపేట, అందుగులపల్లి, బ్రాహ్మణ పల్లి, రాగినేడు, కనగర్థి, కాపులపల్లి, కాసులపల్లి, గోప య్యపల్లి, పాలితం, తుర్కలమద్దికుంట, చందపల్లి, బొం పెలి, మేరపల్లి గ్రామాల్లో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలాంటి కటింగ్‌ లేకుండా కేం ద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తా మన్నారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లిస్తామని తెలిపారు. దళారుల చేతిలో మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, వాటిని రైతు కు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొంద రు ప్రతిపక్ష నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మ వద్దని, ప్రతి గింజ సన్న వడ్లకు బోనస్‌ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప, సింగిల్‌విండో చైర్మన్‌ చింత పండు సంపత్‌, మాజీ జడ్పీటీసీ బండారి రాంమూర్తి, ఐకేపీ ఏపీఎం సంపత్‌, విండో సీఈవో తిరుపతి, కాం గ్రెస్‌ నాయకులు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:53 AM