ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిలా పని చేయాలి
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:37 AM
ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిలా పని చేయాలని టీఎన్‌జీవోస్ కేంద్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ సూచించారు.
సుభాష్‌నగర్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిలా పని చేయాలని టీఎన్‌జీవోస్ కేంద్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ సూచించారు. ఆదివారం కరీంనగర్ టీఎన్‌జీవోస్ భవన్‌లో కొత్త కార్యవర్గాల అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎన్‌జీవోస్‌కు 78 ఏళ్ల చరిత్ర ఉందని, సంఘం నిబద్ధతతో, కమిట్‌మెంట్‌తో పని చేస్తుందన్నారు. కరీంనగర్ జిల్లా ప్రజల్లో ఎంతో చైతన్యం ఉందని, తెలంగాణ ఉద్యమంలోనూ జిల్లా వాసులు చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. సంఘ సభ్యులు ఐకమత్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేయాలన్నారు. కరీంనగర్, చొప్పదండి యూనిట్ల కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు, కేంద్ర సంఘం నాయకులు రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్‌రెడ్డి, సర్దార్ హర్మిందర్‌సింగ్, కోశాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు వొంటెల రవీందర్‌రెడ్డి, టౌన్ అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంత్‌రావు, చొప్పదండి అధ్యక్షుడు కామ సతీష్, కార్యదర్శి గిరిధర్‌రావు, శైలజ, శారద, కరుణాకర్, లవకుమార్, కమలాకర్, వాస్తవిక్ పాల్గొన్నారు.