Share News

పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:29 AM

పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని బీసీ ఆజాది యూత్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్‌ అన్నారు.

పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి
హుజూరాబాద్‌లో మాట్లాడుతున్న బీసీ ఆజాది యూత్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు సంజయ్‌కుమార్‌

హుజూరాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని బీసీ ఆజాది యూత్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్‌ అన్నారు. హుజూరాబాద్‌లో పూలే జ్ఞాన కేంద్రం పేరిట ఏర్పాటు చేస్తున్న కోచింగ్‌ సెంటర్‌ పోస్టర్‌ను ఆయన గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న బీసీ విద్యార్థులకు ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉచిత కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జనవరి 20న ఈ కోచింగ్‌ సెంటర్‌ను హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న పేద బీసీ విద్యార్థులు ఈ కోచింగ్‌ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు కరీం రాజు, నాయకులు కుడికల భాస్కర్‌, శ్రీనివాస్‌, సంపత్‌, కుమార్‌, రమేష్‌, సంపత్‌కుమార్‌, సదానందం పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 12:29 AM