Tribal Relocation: ‘కవ్వాల్’లోని చెంచులను తరలిస్తాం: సురేఖ
ABN , Publish Date - Dec 17 , 2024 | 04:13 AM
కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలోని గిరిజన, చెంచు గ్రామాల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభించినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంచారం పెరగడంతో..
కవ్వాల్ అభయారణ్య ప్రాంతంలోని గిరిజన, చెంచు గ్రామాల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభించినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంచారం పెరగడంతో.. గిరిజనులు, చెంచులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జీవన్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సురేఖ సమాధానం ఇచ్చారు. వన్యప్రాణుల దాడుల్లో మృత్యువాతపడిన బాధితుల కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం అందిస్తున్నట్టు తెలిపారు. తిరుమలలోతెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం తరఫున టీటీడీ చైర్మన్‌ను కోరుతూ లేఖ రాస్తామని ప్రకటించారు.