బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు పోరాటం
ABN , Publish Date - Dec 25 , 2024 | 04:53 AM
కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ కల్పించకుండా ఎగవేయాలని చూస్తే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ హామీలను అమలుచేసే వరకు పోరాటం సాగిస్తామన్నారు. బీసీల సమస్యలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోవడం దారుణమని, కుల వృత్తుల వారికి కనీస మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. కేసీఆర్ హయాంలో బీసీల కోసం అనేక విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.