Share News

10వ తరగతిలో ఇంటర్నల్‌ మార్కుల రద్దు

ABN , Publish Date - Nov 29 , 2024 | 03:05 AM

పదో తరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు జరిగాయి. ఇకపై ఇంటర్నర్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడింగ్‌ను ఇస్తారు.

10వ తరగతిలో  ఇంటర్నల్‌ మార్కుల  రద్దు

  • వార్షిక పరీక్షల్లో మార్కులతోనే గ్రేడింగ్‌

  • విద్యాశాఖ అధికారుల కీలక నిర్ణయం

  • సమాధానాలకు 24 పేజీల బుక్‌లెట్‌

  • అదనపు సమాధాన పత్రాలు ఉండవు

  • పరీక్ష ఫీజు 5వ తేదీ దాకా పొడిగింపు

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు జరిగాయి. ఇకపై ఇంటర్నర్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగానే గ్రేడింగ్‌ను ఇస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు గురువారం ఆదేశాలను జారీ చేశారు. ఈ మార్పులు ప్రస్తుత(2024-2025) విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయి. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం.. పదోతరగతిలో రెండు రకాల మార్కులను పరిగణనలోకి తీసుకునేవారు. వార్షిక పరీక్షల్లో 80ు.. ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌కు 20ు మార్కులను కేటాయించేవారు. అంటే.. సమ్మెటివ్‌ అసె్‌సమెంట్‌(ఎ్‌సఏ)-1,2,3,4 పరీక్షల్లో వచ్చిన మార్కులను సరాసరి చేసి, వీటిని 20 శాతంగా వార్షిక ఫలితాల్లో కలిపేవారు. ఇకపై ఇంటర్నల్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోరు. కేవలం వార్షిక పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగానే(100ు) విద్యార్థులకు సంబంధించిన గ్రేడింగ్‌ను నిర్ణయిస్తారు.


అయితే.. ఎస్‌ఏ పరీక్షలు యధావిధంగా కొనసాగుతాయి. ప్రైవేట్‌ స్కూళ్లల్లో విద్యార్థులకు ఇంటర్నల్‌ మార్కులను ఎక్కువగా నమోదు చేయడం, ఆ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లల్లో మార్కులను వేయకపోవడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఆన్సర్‌ బుక్‌లెట్ల విషయంలోనూ విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. ఇకపై అదనపు ఆన్సర్‌షీట్‌ ఇవ్వకుండా.. ప్రధాన బుక్‌లెట్‌ను 24 పేజీలతో అందజేస్తారు. ఇంతకు ముందు విద్యార్థి 4 పేజీల ప్రధాన ఆన్సర్‌షీట్‌ను పూర్తిచేస్తే.. ఆ తర్వాత నాలుగేసి పేజీల అదనపు ఆన్సర్‌ షీట్లను ఇచ్చేవారు. ఈ విధానాన్ని స్వస్తిపలుకుతూ.. ఇప్పుడు 24 పేజీల జవాబు పత్రాన్ని పరిచయం చేయనున్నారు. కాగా.. గతంలో 11 పేపర్లుగా ఉన్న పదోతరగతి పరీక్షలను కొవిడ్‌ సమయం నుంచి ఆరు పేపర్లకు కుదించిన విషయం తెలిసిందే..! ఈ విధానం యధాతథంగా కొనసాగుతుంది. సైన్స్‌ పేపర్‌ను మాత్రం ఫిజికల్‌ సైన్స్‌, బయోలాజికల్‌ సైన్స్‌గా రెండు పరీక్షలుగా నిర్వహిస్తారు.


  • టెన్త్‌ ఫీజు గడువు పొడిగింపు!

పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు గడువును పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఫీజు గడువు గురువారంతో ముగిసింది. అయితే.. విద్యార్థుల సౌలభ్యం కోసం ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా.. ఈ తేదీని డిసెంబరు 5వ తేదీ వరకు పొడిగించారు. రూ. 50 లేట్‌ ఫీజుతో డిసెంబరు 12వ తేదీ వరకు.. రూ.200 లేట్‌ ఫీజుతో డిసెంబరు 19 వరకు, రూ.500 లేట్‌ ఫీజుతో డిసెంబరు 30 వరకు ఈ గడువును పొడిగించారు

Updated Date - Nov 29 , 2024 | 03:05 AM