Danam Nagender: ఖైరతాబాద్ మహా గణపతి కొత్త ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశాం..
ABN , Publish Date - Jul 17 , 2024 | 12:46 PM
ఖైరతాబాద్ మహా గణపతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఈ ఏడాది గణేష్ నవరాత్రులను వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఈ ఏడాది గణేష్ నవరాత్రులను వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ రోజు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మహా గణపతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటారని తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. రెండు కమిటీ ఆలోచనలను పరిగణలోకి తీసుకున్నామన్నారు.
అందరూ ఉత్సవ కమిటీ సభ్యులేనని దానం నాగేందర్ అన్నారు. కులమతాలకు అతీతంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. రాబోయే రోజుల్లో గిన్నిస్ రికార్డ్స్‌లోకి ఎక్కబోతున్నామని.. దీనిని బాధ్యతగా భావించి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మా మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని తెలిపారు. అడ్‌హాక్ పేరుతో ఖైరతాబాద్ గణేష్ కొత్త ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. డొనేషన్స్ నుంచి వచ్చే డబ్బును రోజూ డిస్‌ప్లే చేస్తామన్నారు. విద్యా, ఆర్థిక స్థోమత లేని వారికీ సహాయం అందిస్తామన్నారు. మల్టి పర్పస్ కమ్మూనిటి హాల్ కట్టబోతున్నామని దానం నాగేందర్ వెల్లడించారు. ఇక్కడ ఖైరతాబాద్ వాసులు నామినల్ ఫీ కట్టి హాల్‌ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
అడహక్ కమిటీకి తాను అధ్యక్షుడిగానూ.. రాజ్ కుమార్ చైర్మన్ గానూ ఉంటారని తెలిపారు. అడ్ హాక్ ఉత్సవ్ కమిటీలో 100 మంది సభ్యులు ఉంటారని తెలిపారు. కమిటీ సభ్యులకు ఐడి కార్డు ఉంటుందని వెల్లడించారు. ఉత్సవ కమిటీ సభ్యులంతా సమానమేనన్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ , శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ మధ్య విభేదాల నేపథ్యంలో అడ్ హాక్ పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశామని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఇక ఖైరతాబాద్ గణేషుని వద్ద ప్రతి రోజూ ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. పోలీసులు, మీడియా వలంటీర్స్‌కు భోజనాలను ఏర్పాటు చేస్తామన్నారు. బోనాల ఫెస్టివల్ తర్వాత ధూప దీపాలకు నోచుకోని అన్ని టెంపుల్స్‌కి కమిటీలు ఏర్పాటు చేయబోతున్నామని దానం నాగేందర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
Andhra Pradesh: పెద్దిరెడ్డికి బిగ్ షాక్.. కలెక్టర్ కీలక ఆదేశాలు..
Lanka Dinakar: భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన