Share News

TG Elections 2024 Counting: శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన పార్లమెంట్ కౌంటింగ్

ABN , Publish Date - Jun 04 , 2024 | 07:40 AM

ఖమ్మం జిల్లా: రూరల్ మండలం పొన్నెకల్లులోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఖమ్మం పార్లమెంట్ కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఖమ్మం లోక్ సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అబ్జర్వర్లు ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేశారు.

TG Elections 2024 Counting:  శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన పార్లమెంట్ కౌంటింగ్

ఖమ్మం జిల్లా: రూరల్ మండలం పొన్నెకల్లు (Ponnekallu)లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో (Sri Chaitanya College of Engineering) ఖమ్మం పార్లమెంట్ కౌంటింగ్ (Parliament Counting) ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఖమ్మం లోక్ సభ (Khammam Lok Sabha) స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అబ్జర్వర్లు ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేశారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అశ్వరావు పేట నియోజకవర్గంలో 184 పోలింగ్ కేంద్రాలు ఉండగా 13 రౌండ్లు ఉండడంతో లెక్కింపు మొదటకౌంటింగ్ పూర్తి కానున్నది. పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, సర్వీస్ ఓట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధికారులు 14 టేబుల్ పై లెక్కించనున్నారు.


ఏడు సెగ్మెంట్లకు గాను మొత్తం 7 కౌంటింగ్ హల్స్, పోస్టల్ బ్యాలెట్‌‌లకు ఒకటి మొత్తం 8 హాల్స్ ఉండగా ప్రతి హల్‌లో 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా ఖమ్మంకు టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అధికారులు18 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఖమ్మం బరిలో మొత్తం అభ్యర్థులు 55 మంది ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 16,31,329 ఉండగా 12,41,135 ఓట్లు నమోదయ్యాయి. కౌంటింగ్ విధులకు 1500 మంది సిబ్బంది హాజరయ్యారు. కౌంటింగ్ కేంద్రం వద్ద సీఆర్పిఎఫ్ బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Hyderabad: తీర్పుకు వేళాయె..

Pinnelli : ఇదేమి తీర్పు?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 04 , 2024 | 07:40 AM