Allu Arjun: అరెస్టు బాధ్యతారాహిత్యం : కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Dec 14 , 2024 | 03:32 AM
అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కార్యక్రమ వేదిక వద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదని, కానీ అలా చేయకుండా ఇప్పుడు వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యడం సరికాదని ఎక్స్‌లో పోస్టు చేశారు. కార్యక్రమ నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అన్నారు.