Share News

Komatireddy Venkat Reddy: తెలంగాణ కోసం నేను కూడా దీక్ష చేశా

ABN , Publish Date - Nov 30 , 2024 | 04:29 AM

ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమ సమయంలో తాను కూడా దీక్ష చేశానని, మంత్రి పదవిని సైతం త్యాగం చేశానని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Komatireddy Venkat Reddy: తెలంగాణ కోసం నేను కూడా దీక్ష చేశా

  • మంత్రి పదవిని త్యజించా: మంత్రి కోమటిరెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌ / ధర్పల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమ సమయంలో తాను కూడా దీక్ష చేశానని, మంత్రి పదవిని సైతం త్యాగం చేశానని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదని, దీక్షా దివస్‌ పెద్ద జోక్‌ అని ఎద్దేవా చేశారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు ధర్పల్లి, ఇందల్వాయిలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన... యువకులు, విద్యార్థుల పోరాట ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందన్నారు. దీక్షా దివస్‌ జరుపుకునే అవసరం బీఆర్‌ఎస్‌ నేతలకు లేదన్నారు.


తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చిందని, అందుకే డిసెంబర్‌ 9న సచివాలయంలో లక్షలాది మంది మహిళలతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగబోతుందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనా కాలం ‘దోచుకో.. దాచుకో’ అన్న రీతిలో సాగిందన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావులకు అభివృద్ధి కనపడటం లేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందని ప్రతిరోజూ ఇష్టమొచ్చినట్లు వాగుతున్నారన్నారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలో ఎక్కడా గుంతలు లేని రహదారులను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. నిజామాబాద్‌ జిల్లాకు మంజూరైన పసుపు బోర్డు అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 04:29 AM