Share News

Temple Development: అలంపూర్‌ ఆలయాలను పట్టించుకోని కేసీఆర్‌: మంత్రి సురేఖ

ABN , Publish Date - Oct 09 , 2024 | 03:10 AM

2016 కృష్ణా పుష్కరాల సమయంలో అలంపూర్‌ ఆలయాల అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తానన్న గత సీఎం కేసీఆర్‌ వంద రుపాయలు కూడా ఇవ్వలేదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

Temple Development: అలంపూర్‌ ఆలయాలను పట్టించుకోని కేసీఆర్‌: మంత్రి సురేఖ

  • నాగార్జున అంశంపై నో కామెంట్‌ అంటూ దాటవేత

అలంపూర్‌, అక్టోబరు 8: 2016 కృష్ణా పుష్కరాల సమయంలో అలంపూర్‌ ఆలయాల అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయిస్తానన్న గత సీఎం కేసీఆర్‌ వంద రుపాయలు కూడా ఇవ్వలేదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్కియాలజీ విభాగంతో సమీక్ష నిర్వహించి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆమె జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగుళాంబదేవి ఆలయాన్ని సందర్శించి పూజ చేశారు.


అనంతరం విలేకర్ల సమావేశంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ.. మహిమాన్వితమైన అలంపూర్‌ జోగుళాంబదేవి అమ్మవారిని దర్శించుకోవడం భక్తులందరి భాగ్యమన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివాదంపై మంత్రిని ప్రశ్నించగా.. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున మాట్లాడనని దాటవేశారు.

Updated Date - Oct 09 , 2024 | 03:10 AM