Konda Surekha: ఏడాదిలోనే ఆలయాల్లో సౌకర్యాలు మెరుగుపరిచాం: కొండా సురేఖ
ABN , Publish Date - Dec 01 , 2024 | 05:00 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఆలయాల్లో సామాన్య భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగుపరిచామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
హైదరాబాద్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఆలయాల్లో సామాన్య భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగుపరిచామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అనేక పనుల్ని పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలకు అధిక ప్రాధాన్యతనిస్తు సమ్మక్క, సారలమ్మ, బోనాల జాతరలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందని చెప్పారు.
గతంలో ఎన్నడు లేని విధంగా దేవాదాయ శాఖ సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహించిందని, బాసర సరస్వతి, అలంపూర్ జోగులాంబ దేవాలయాల్లో నదీ హారతి కార్యక్రమం చేపట్టామని వివరించారు. ఉత్సవ కమిటీలు, ట్రస్ట్ బోర్డుల ఏర్పాటుతో పాటు ఆక్రమణదారుల నుంచి పెద్ద మొత్తంలో దేవాదాయ భూములు తిరిగి స్వాధీనం చేసుకున్నామని శనివారం ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.