Konda Surekha: కేసీఆర్‌ను అందుకే ఇంటికి పంపారు
ABN , Publish Date - Apr 26 , 2024 | 07:20 PM
తెలంగాణ రాష్ట్రాన్నే కాదు.. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌ను సైతం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభివద్ధి చేయలేదని.. అందుకే ఆయన్ని ప్రజలు ఇంటికి పంపించారని మంత్రి కొండా సురేఖ వ్యంగ్యంగా అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దౌలాపూర్ గ్రామంలో శిలా ప్రతిష్టా మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవానికి కొండా సురేఖతోపాటు నీలం మధు హాజరయ్యారు.
సిద్దిపేట, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్రాన్నే కాదు.. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌ను సైతం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అభివద్ధి చేయలేదని.. అందుకే ఆయన్ని ప్రజలు ఇంటికి పంపించారని మంత్రి కొండా సురేఖ వ్యంగ్యంగా అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దౌలాపూర్ గ్రామంలో శిలా ప్రతిష్టా మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవానికి కొండా సురేఖతోపాటు నీలం మధు హాజరయ్యారు.
AP Elections 2024: ఎన్నికల బరి నుంచి కొడాలి నాని ఔట్!?
ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ మాట్లాడరని.. కానీ ఆయన దొడ్డి దారిలో రైతులను కలుస్తున్నారని మండిపడ్డారు. కేసీఅర్ తెలివి తక్కువ రాజకీయాలు చేస్తూ.. ఓడిపోయిన ఫ్రస్టేషన్‌లో అర్థం కాకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బిఅర్ఎస్ పార్టీకి పట్టిన గతే దేశంలో బిజెపికి పడుతుందని జోస్యం చెప్పారు.
AP Elections : పిఠాపురానికి కడప రౌడీలు
AP Elections : పిఠాపురానికి కడప రౌడీలు
దేవుణ్ణి చూపిస్తూ ఓట్లు అడిగే సంస్కృతి బిజెపి పార్టీ నుండే ప్రారంభమైందని గుర్తు చేశారు. దేవుళ్ళను అడ్డుపెట్టి బిజెపి రాజకీయాలు చేయడం తాను తొలిసారిగా చూస్తున్నానన్నారు. బాల రాముణ్ణి పక్కన సీతా దేవి లేకుండా మోడీ అయోధ్య ఆలయాన్ని నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Election 2024: చంద్రబాబు భార్య భువనేశ్వరి టార్గెట్‌గా ‘డీప్ ఫేక్’ ప్రచారం.. విషయం ఏంటంటే?
అయితే ఇది దేశానికే అరిష్టమనే విషయం ఆయనకు అర్థమైందని కొండా సురేఖ పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది లేదని సురేఖ విమర్శించారు. మెదక్ లోక్‌సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేది గజ్వేల్ నియోజకవర్గంలో మాత్రమేనని ఈ సందర్బంగా కొండా సురేఖ స్పష్టం చేశారు.
Read National News and Telugu News