Share News

Sambasivarao: హైడ్రా పేరుతో జనాన్ని భయపెడుతున్నారు

ABN , Publish Date - Aug 26 , 2024 | 03:33 AM

రాష్ట్ర మంత్రుల్లో సమన్వయ లోపం కనిపిస్తోందని సీపీఐ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Sambasivarao: హైడ్రా పేరుతో జనాన్ని భయపెడుతున్నారు

  • రాష్ట్ర మంత్రుల్లో సమన్వయ లోపం: కూనంనేని

బాలసముద్రం, ఆగస్టు 25: రాష్ట్ర మంత్రుల్లో సమన్వయ లోపం కనిపిస్తోందని సీపీఐ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంత్రుల మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదని చెప్పారు. ఒకరు చెప్పినదానికి మరొకరు చెప్పేదానికి సంబంధమే ఉండడం లేదన్నారు. ఆదివారం హనుమకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాన్యులు, పేదలు ఇళ్లు నిర్మించుకుంటే కూల్చి వేస్తామంటూ హైడ్రా పేరుతో జనాలను భయపెడుతున్నారన్నారు.


హైడ్రా నుంచి సామాన్యులకు విముక్తి కల్పించాలని కోరారు. హైదరాబాద్‌లో సినీ నటుడు నాగార్జున ఎఫ్టీఎల్‌ పరిధిలో నిర్మించిన ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేయడం సరైందేనన్నారు. స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారే ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మేరకు నూతన చట్టాలను రూపొందించాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీతో సఖ్యతగా ఉంటూనే సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సెప్టెంబరు 17న తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్నారు.

Updated Date - Aug 26 , 2024 | 03:33 AM