KTR: మూసీ పేరిట ఢిల్లీకి మూటలు
ABN , Publish Date - Nov 17 , 2024 | 04:33 AM
‘మూసీ’ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు డబ్బులు కావాలని, అందుకే రేవంత్ మూటలు పంపే పనిలో ఉన్నారని విమర్శించారు.
రేవంత్.. నీ వాటా ఎంత?
సీఎం పదవి తుమ్మితే ఊడేదే
రేవంత్‌కు సహాయ మంత్రి
తరహాలో బండి సంజయ్
పొంగులేటి తుస్సు మంత్రి
బీజేపీ నేతలు కాంగ్రెస్‌లో ఉన్నారా?.. కేటీఆర్ విసుర్లు
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘మూసీ’ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు డబ్బులు కావాలని, అందుకే రేవంత్ మూటలు పంపే పనిలో ఉన్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డిది తుమ్మితే ఊడిపోయే పదవి అని, ఢిల్లీవాళ్లకు కోపం వస్తే సీఎం పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే ప్రయోజనమెంత అంటూ తమను ప్రశ్నించారని, మరి మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెంత మంది? కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు ఎంత? మూసీ మూటల్లో మీ వాటా ఎంత? అంటూ రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్యాద్రి నాయుడు, షేక్ అరిఫ్ తమ అనుచరులతో కలిసి శనివారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ పైరవీల కోసం పార్టీ మారినా తామున్నామంటూ కార్యకర్తలు బీఆర్‌ఎస్ వెనుక నిలబడటం గర్వంగా ఉందన్నారు.
సంక్షేమానికి లేని నిధులు మూసీకి ఎక్కడివి?
సంక్షేమ పథకాలకు పైసలు లేవంటగానీ మూసీ ప్రాజెక్టుకు రూ.లక్షా 50వేల కోట్లు ఉన్నాయనడం విడ్డూరమని కేటీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారాడని, తాము సీఎంను తిడితే బీజేపీ ఎంపీలకు రోషమొస్తుందని, బండి సంజయ్, రఘనందన్‌రావు, విశ్వేశ్వర్‌రెడ్డి, ఆర్వింద్ తట్టుకోలేకపోతున్నారని కేటీఆర్ అన్నారు. అసలు వాళ్లు బీజేపీలో ఉన్నారా లేక కాంగ్రె్‌సలో ఉన్నారా? రేవంత్ కూ డా బీజేపీలో ఉన్నాడా? కాంగ్రె్‌సలో ఉన్నాడా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
పొంగులేటి బాంబులు పేలడం లేదు
బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అమవాస్యకు బాం బులు కొంటే కార్తీక పౌర్ణమి నాటికి కూడా పేలడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన తుస్సు బాంబుల శాఖ మంత్రి అని అన్నారు. తాను కోకాపేట భూముల్లో అవినీతికి పాల్పడ్డానని రేవంత్ ఆరోపించారని, విచారణ జరిపించి తప్పు చేస్తే శిక్ష వేయాలని సవాల్ చేశారు.
వందలాది కేటీఆర్‌లు పుట్టుకొస్తారు
రేవంత్‌రెడ్డి గాడ్సే శిష్యుడని, గాడ్సే వారసుడని కేటీఆర్ ఆరోపించారు. గాంధీ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయాలు చేస్తామంటే మంచిది కాదని సూచించారు. ఏవో కేసులు పెట్టి జైళ్లో పెడితే ప్రశ్నించటం మానేస్తామనుకుంటున్నారని, తాను జైలుకు పోతే వందలాది మంది కేసీఆర్‌లు, కేటీఆర్‌లు పుట్టుకొస్తారన్నారు. ఇప్పడే పోరాటం మొదలైందని, మరో నాలుగేళ్లు కాంగ్రె్‌సతో పోరాటం చేయాల్సి ఉందన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలకు సిగ్గు లేదని, ఏ పార్టీలో ఉన్నారో చెప్పే దమ్ము కూడా లేదన్నారు. రాజేంద్రనగర్‌లో ఉపఎన్నిక రావటం ఖాయమని, ఆ ఎన్నికలో గులాబీ జెండా ఎగరటం ఖాయమని అన్నారు.
హామీలను నమ్మి ఓట్లేస్తే భస్మాసుర హస్తమైంది...
శరం తప్పినోడు చేనేస్తే వడగళ్ల వానకు పోయిందట అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా విమర్శించారు. 420 హామీల కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా కింద రూ.15వేలు రాలేద ని, రూ.2లక్షల పంట రుణాల పథకం పూర్తిగా అమలుకాలేదని అన్నారు. 24 గంటల ఉచిత కరెంటు మాయమైందని, పంటల కొనుగోళ్లు జరగడంలేదని, ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వలేదని పేర్కొన్నా రు. అబద్ధపు హామీలు నమ్మి ఓటేస్తే... భస్మాసుర హస్తమైందని అన్నారు.