Share News

KTR: కూల్చడాలు తప్ప చేసిందేమీ లేదు

ABN , Publish Date - Oct 31 , 2024 | 04:36 AM

కట్టిందేమీ లేదు.. కూల్చడాలు తప్ప.. రేవంత్‌రెడ్డి పది నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన దానికన్నా.. వాళ్ల నుంచి లాక్కున్నదే ఎక్కువని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

KTR: కూల్చడాలు తప్ప చేసిందేమీ లేదు

  • చిట్టినాయుడూ.. నువ్వా కేసీఆర్‌ను తుడిచేది?

  • రేవంత్‌రెడ్డి లాంటి హౌలాకు భయపడం: కేటీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కట్టిందేమీ లేదు.. కూల్చడాలు తప్ప.. రేవంత్‌రెడ్డి పది నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన దానికన్నా.. వాళ్ల నుంచి లాక్కున్నదే ఎక్కువని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. నమ్మి నానబోస్తే పుచ్చులు చేతికొచ్చినట్లు ఆయన పాలన ఉందని బుధవారం ఎక్స్‌ వేదికగా ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్‌ పదవుల కోసం పరితపిస్తున్నారని, నాడు.. కేసీఆర్‌ ఉన్నపదవిని తృణప్రాయంగా వదిలేశారని, ఉద్యమానికి తన ప్రాణాన్ని ఫణంగా పెట్టారన్నారు.


అలాంటి కేసీఆర్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడతావా అంటూ మండిపడ్డారు. కాగా, ఎన్నికల హామీలు అమలు చేయాలని వాట్సా్‌పలో ప్రశ్నించిన భాస్కర్‌ ముదిరాజ్‌పై మహబూబ్‌నగర్‌ సీఐ అప్పయ్య బెల్ట్‌తో కొట్టిన ఘటనపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం బాధితునితో హైదరాబాద్‌ నుంచి ఫోన్లో మాట్లాడిన ఆయన.. రేవంత్‌రెడ్డి లాంటి హౌలా వ్యక్తుల బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

Updated Date - Oct 31 , 2024 | 04:36 AM