Share News

KTR: ప్రభుత్వ హాస్టళ్ల దుస్థితిపై కేటీఆర్ ఫైర్..

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:12 PM

“మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అని అన్నారని.. మొత్తానికి.. కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దేవా చేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి.. పురుగుల అన్నం.. నీళ్ల చారు ఉండేవన్నారు.

KTR: ప్రభుత్వ హాస్టళ్ల దుస్థితిపై కేటీఆర్ ఫైర్..

హైదరాబాద్: “మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అని అన్నారని.. మొత్తానికి.. కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఆనాటి కాంగ్రెస్ (Congress) పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి.. పురుగుల అన్నం.. నీళ్ల చారు ఉండేవన్నారు. ఈనాటి కాంగ్రెస్ పాలనలో.. ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఉందన్నారు. బల్లిపడిన టిఫిన్లు – చిట్టెలుకలు తిరిగే చట్నీలు పిల్లలకు వడ్డిస్తున్నారన్నారని ఫైర్ అయ్యారు. మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో.. కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతంగా మారిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.


నిన్న కోమటిపల్లి హాస్టల్‌లో ఉప్మాలో బల్లి పడి.. 20 మంది విద్యార్థులకు వాంతులు అయ్యాయన్నారు. సుల్తాన్ పూర్ జేఎన్టీయూ హాస్టల్‌లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తుతున్నారని కేటీఆర్ తెలిపారు. ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరని ప్రశ్నించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడుందని నిలదీశారు. కలుషిత ఆహారం వల్ల... పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే.. విద్యార్థులకు ఈ అవస్థ... ఈ అస్వస్థత.. అని పేర్కొన్నారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలన్నారు. లేకపోతే.. భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదమన్నారు. వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం చోటు చేసుకుంటుందని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఈవీఎం పగులగొట్టలేదు: పోలీసుల విచారణలో పిన్నెల్లి..

సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 10 , 2024 | 01:12 PM