Share News

Shanti Issue: శాంతి, విజయసాయిల గురించి నివ్వెరపోయే విషయాలు చెప్పిన మదన్

ABN , Publish Date - Jul 15 , 2024 | 05:30 PM

దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి- వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డిల బంధం గురించి మదన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి కన్న బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి అని స్పష్టం చేశారు. బాబు గురించి తాను పదే పదే ప్రశ్నించగా చివరికి ఒప్పుకుందని వివరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మదన్ మీడియాతో మాట్లాడారు. తన విద్యాభ్యాసం, పెళ్లి, అమెరికా వెళ్లి రావడం అన్నింటి గురించి పూస గుచ్చినట్టు వివరించారు.

Shanti Issue: శాంతి, విజయసాయిల గురించి నివ్వెరపోయే విషయాలు చెప్పిన మదన్
Madan

హైదరాబాద్: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి- వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డిల బంధం గురించి.. ఆమె భర్త మదన్ మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట శాంతి.. ఆ తర్వాత విజయసాయిరెడ్డి వరుసగా మీడియా ముందుకు రాగా.. ఈ ఇద్దరికీ కౌంటర్‌గా మదన్ ఇవాళ మీడియా ముందుకొచ్చి అసలేం జరిగింది..? విద్యాభ్యాసం, పెళ్లి, అమెరికా వెళ్లి రావడం అన్నింటి గురించి పూస గుచ్చినట్టు వివరించారు. శాంతి కన్న మగ బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డే అని స్పష్టం చేశారు. బాబు గురించి తాను పదే పదే ప్రశ్నించగా చివరికి ఈ విషయం ఒప్పుకుందని వివరించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మదన్ (Madan) మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పేశారు.


నేపథ్యం..

నేను.. శాంతి ఇద్దరం ఎస్టీ కులానికి చెందినవారం. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. నేను అమెరికా వెళ్లి రూ.10 లక్షలు తీసుకొని వచ్చాను. రూ.5 లక్షలతో 2013లో ఘనంగా పెళ్లి చేసుకున్నాం. రూ.5 లక్షలు ఇతర ఖర్చులు చేశాం. 2015లో మాకు ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. 2017లో దమ్మాయిగూడెంలో రూ.45 లక్షలు పెట్టి డ్యూపెక్స్ ఇళ్లు తీసుకున్నాం. శాంతి డిగ్రీలో లా చేసింది. ప్రాక్టీస్ చేయమని చెప్పాను. ప్రాక్టీస్ కోసం కరీంనగర్ కోర్టుకు కూడా వెళ్లేది. 2019లో ఎండొమెంట్ పరీక్ష రాసింది. రిజర్వేషన్ కావడంతో పోస్టింగ్ వచ్చింది. 2020లో విశాఖపట్టణంలో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. 2020లో జనవరిలో పీహెచ్‌డీ కోసం అమెరికా వెళ్లాను. మళ్లీ తిరిగి వెళ్లొచ్చాను. భార్య హ్యాండిల్ చేస్తుందో లేదోననే అనుమానం ఉండేది. కొవిడ్ రావడంతో ఇక్కడే ఉండాల్సి వచ్చింది. 2021లో మరొసారి కాల్ వచ్చింది. వెళ్లాలని భార్య ఒత్తిడి చేసింది. నా భార్య నాతో దురుసుగా ప్రవర్తించేది. ఏందిరా నీ నీతులు, నీ సోది అనేది. ఆ క్రమంలోనే 2021లో పై అధికారి వర్దన్‌తో గొడవ జరిగిందిఅని మదన్ వివరించారు.


వారం రావాలని..

‘2022 జనవరిలో పీహెచ్‌డీ కోసం అమెరికా వెళ్లాను. సెప్టెంబర్‌‌లో రావాలని శాంతి నన్ను అడిగింది. వారం రోజులు రావాలని కోరింది. తాడేపల్లిలో విల్లా కొనుగోలు చేస్తాం అని చెప్పింది. రూ.4 కోట్ల విల్లా రూ.2.5 కోట్లకు విజయసాయిరెడ్డి ఇప్పిస్తున్నారని వివరించింది. ఆ సమయంలో వద్దని చెప్పాను. ఎంత చెప్పినా శాంతి వినిపించుకోలేదు. సరేనని వచ్చాను. శంషాబాద్‌లో విజయసాయిరెడ్డి ఫామ్ హౌస్ వద్దకు వచ్చా. అక్కడ సాయిరెడ్డి భార్య సునంద రూ.60 లక్షల నగదు ఇచ్చారు. అక్కడ్నుంచి నేరుగా కారులో విశాఖపట్నం వెళ్లాను. మార్గమధ్యలో విజయవాడలో ఉన్న విల్లాను కూడా చూశాను. అప్పటికే కోటి రూపాయిలు.. సాయిరెడ్డి ఇచ్చారు. మరో రూ.కోటిని శాంతి సమకూర్చింది. రూ. 2.60 కోట్లతో విల్లా కొనుగోలు చేశాం. ఆ సమయంలో ఇద్దరం ఫిజికల్‌గా కలిశాం.. తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. 2022 సెప్టెంబర్ 25వ తేదీన తిరిగి అమెరికా వెళ్లాను’ అని మదన్ స్పష్టం చేశారు.


విజయసాయిరెడ్డి గురించి చెప్పింది..

విజయసాయిరెడ్డి గురించి నాకు శాంతి చెప్పింది. ఒకసారి జూబ్లిహిల్స్‌లో ఇంటికి తీసుకెళ్లింది. సాయిరెడ్డి భార్య సునంద మేడమ్‌ను పరిచయం చేసింది. ఫొటోలు కూడా దిగాం. నా అమెరికా స్కాలర్ షిప్ అప్లికేషన్ గురించి అడిగాను. ఢిల్లీలో అప్లికేషన్ మూవ్ చేసి ఆయన హెల్ప్ చేశారు. 2022 సెప్టెంబర్‌‌లో అమెరికా వెళ్లిన తర్వాత ప్రెగ్నెంట్ అని చెప్పింది. డౌట్ వచ్చి ఎలా అయ్యావని అడిగాను. మనం జాగ్రత్తలు తీసుకున్నాం కదా అని చెబితే.. హౌ డేర్ టు యు ఆస్క్.. అని ఇంకొసారి అడిగితే చెప్పుతో కొడతా అంది. తర్వాత గూగుల్‌లో సెర్చ్ చేశా..? డ్రాప్స్ పడిన ప్రెగ్నెంట్ అవుతుందని తెలుసుకున్నా. మేం కలిసిన సమయంలో అమ్మాయి కడుపులో 2 నెలల బేబీ ఉందని తర్వాత తెలుసుకున్నాను. నేను సెప్టెంబర్‌లో వస్తే 2023 ఏప్రిల్‌లో శాంతి డెలివరీ అయ్యింది. 7 నెలల కన్నా ముందే డెలివరీ అయ్యింది. 2022 డిసెంబర్‌లో వస్తానంటే వద్దని చెప్పింది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ గురించి అడిగావని చెప్పుకొచ్చింది. శాంతికి విజయవాడ ట్రాన్స్‌ఫర్ అయ్యింది. పిల్లలు విశాఖపట్టణంలో ఉన్నారు. బదిలీ విషయం గురించి సాయిరెడ్డితో మాట్లాడాను. అంత ఈజీ కాదన్నారు. 2022 డిసెంబర్‌లో ఇండియాకు వచ్చా. నెల రోజులు ఉన్న శాంతిని కలిసే అవకాశం రాలేదు. 2023 జనవరి 9వ తేదీన వెళ్లే సమయంలో పచ్చళ్లు, చైన్, బ్రాస్ లెట్ పంపించింది’ అని మదన్ చెప్పారు.


తండ్రి ఎవరు..?

అమెరికా నుంచి 2024 జనవరి 3వ తేదీన వచ్చాను. అప్పటి నుంచి బిడ్డ ఎవరికీ జన్మించారనే అంశంపై గొడవ. రోజు శాంతితో టార్చర్. నేను అమెరికాలో ఉండగా ఐవీఎఫ్ చేయించుకున్నానని నా స్నేహితులతో చెప్పింది. అదేంటి ఏం అవసరం అని అడిగితే ఏదో కారణం చెప్పింది. నీ పేరు మీద ఉండనని చెప్పింది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వివరించా. ఐవీఎఫ్ అయితే ఎక్కడ చేయించుకున్నావ్.. డోనర్, ఆస్పతి పేరు అడిగితే సమాధానం లేదు. పదే పదే ప్రశ్నించగా.. పిడుగులాంటి నిజం చెప్పింది. విజయసాయి రెడ్డికి పిల్లలు లేరు, దత్తత తీసుకున్న కూతురు ఉంది. బాబు కావాలంటే కనిపెట్టానని చెప్పింది. అయినా సరే.. ఐవీఎఫ్ ఎలా చేయించుకున్నావు..? అని అడిగాను. ఆస్పత్రి పేరు చెప్పాలంటే.. పేర్లు మార్చామని చెప్పింది. ఐవీఎఫ్ ఏం లేదు. ఫిజికల్ రిలేషన్ షిప్ ద్వారా బాబు జన్మించాడని తెలుసుకున్నా. నేను పెద్దాయనను వెళ్లి అడగగలనా..? ఆ రోజు పెద్ద పాపను హోటల్లో హత్తకుకొని పడుకున్నా. బాధపడ్డా. ఇప్పుడు నన్ను లైఫ్ నుంచి వెళ్లిపో అంటోంది. నా ఇద్దరు పిల్లలు ఏం కావాలి..?’ అని మదన్ ఆవేదన వ్యక్తం చేశారు.


ALSO READ: Ponnam Prabhakar: బండి సంజయ్‌పై పొన్నం ఘాటు వ్యాఖ్యలు

సుభాష్ ఎంట్రీ

‘నాకు బ్రాస్ లెట్, చైన్ తీసుకొన్న సుభాష్.. పోతిరెడ్డి సుభాష్ రెడ్డి. పీలేరు స్వగ్రామం. స్పెషల్ గవర్నమెంట్ ఫ్లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్‌లో పనిచేశారు. బాబు తండ్రి గురించి తెలుసుకోవాలని విశాఖ అపోలోకి వెళ్లాను. అక్కడ మెయిన్ రిజిస్ట్రార్‌లో తండ్రి స్థానంలో నా పేరు ఉంది. కేసు షీట్ అడిగా.. అందులో పి సుభాష్ పేరు ఉంది. మరో చోట పోతిరెడ్డి సుభాష్ అని రాసి ఉంది. తర్వాత ఆయనకు ఫోన్ చేసి మీ ఇద్దరు (మీది, సాయిరెడ్డి) పేర్లు వస్తున్నాయని అడిగా. నాకు భార్య, కూతురు ఉంది. నాకేం సంబంధం లేదు.. డీఎన్ఏ టెస్ట్‌కు సిద్దం అన్నాడు. ఆ బిడ్డకు నాకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. దాంతో శాంతి- విజయసాయిరెడ్డికి ఆ బిడ్డ జన్మించాడని నాకు క్లియర్‌గా అర్థమైంది. శాంతితో నేను విడాకులు తీసుకోలేదు. విడాకుల కోసం నాపై ఒత్తిడి తీసుకొచ్చింది. శాంతి చూపించిన డాక్యుమెంట్ 2016 అనేది తప్పు.. అది మొన్న జూన్‌ 11వ తేదీన సంతకం చేశాను. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవాలని, దీనికి తాను ఏ పరీక్షకు అయినా సిద్ధంఅని మదన్ స్పష్టం చేశారు

ఈ వార్తలు కూడా చదవండి...

Tourists: వికారాబాద్‌లో టూరిస్టులకు వింత కష్టాలు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 15 , 2024 | 10:41 PM