Share News

ప్రజల వెంటే మేము

ABN , Publish Date - Nov 20 , 2024 | 10:51 PM

ప్రజలు, కార్యకర్తల వెంటే మేము ఉంటామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు.

ప్రజల వెంటే మేము
అయిజ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందితో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

- ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి

అయిజ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ప్రజలు, కార్యకర్తల వెంటే మేము ఉంటామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. బుధవారం అయిజ పట్టణంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే విజయుడుతో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 30 పడకల అసంపూర్తి ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోకి వెళ్లి వైద్య సదుపాయాలను, వైద్యం గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందించాలని డాక్టర్లకు సూచించారు. తిక్క వీరేశ్వర ఆలయం వెనుక వంతెన నిర్మించాలని కోరటంతో అక్కడ పరిశీలించారు. నిధులకై ప్రభుత్వాన్ని కోరతానన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చిన తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అభివృద్ధి విషయంలోను, సహకారం అందించటంలోనూ ఎప్పుడు ముందుంటామని తెలిపారు. దూప, దీప నైవేద్య అర్చకులకు గుర్తింపు కార్డులను జిల్లా అధ్యక్షుడు చక్రవర్తి ఆచార్యుల ఆధ్వర్యంలో అందచేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న, వైస్‌ చైర్మన్‌ మాల నర్సింహులు, కౌన్సిలర్లు సురేష్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు మల్లికార్జున్‌రెడ్డి, పల్లయ్య, భూమ్‌పూర్‌ నర్సింహరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 10:51 PM