Share News

హమాలీలకు సమగ్ర చట్టం తేవాలి

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:23 PM

హమాలీలకు ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకురావాలని టీ యూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం డి మాండ్‌ చేశారు.

హమాలీలకు సమగ్ర చట్టం తేవాలి

ఆత్మకూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : హమాలీలకు ఉపాధి, ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర చట్టం తీసుకురావాలని టీ యూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం డి మాండ్‌ చేశారు. ఆత్మకూరు పట్టణ కేంద్రం లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో లోడింగ్‌ అన్‌ లోడింగ్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం హాజరై మా ట్లాడారు. ఒకప్పుడు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో రైతులతో హమాలీలతో మార్కెట్‌ యార్డులు కళకళలాడుతూ... హమాలీలకు ఉపా ధి దొరికేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నూ తన మార్కెటింగ్‌ విధానంతో మార్కెట్‌ హమా లీలకు పని దొరకక పస్తులుండే పరిస్థితి దాపు రించిందని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలీ ప ని ఆసరా తీసుకుని జీవనం సాగిస్తున్నా.. కార్మి కులు ఉపాధి కోసం వలసలు వెళ్లే పరిస్థితి ఏర్ప డిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వే తనాలు అమలు చేయక, ఉన్న చట్టాలను తీసివే సి కార్మికుల హక్కులను హరిస్తున్నారని మండి పడ్డారు. అనంతరం నూతన కమిటీని ఏకగ్రీ వంగా ఎంపిక చేశారు. అధ్యక్షులుగా లూథర్‌, ఉ పాధ్యక్షులుగా మోహన్‌, ప్రధాన కార్యదర్శిగా జైపాల్‌, సహాయ కార్యదర్శిగా అమీర్‌, కోశాఽ దికారిగా యాకోబ్‌ తో పాటు మరో పదిమందిని కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు.

Updated Date - Dec 27 , 2024 | 11:23 PM