Share News

మూతపడ్డ మార్కెట్‌ యార్డు

ABN , Publish Date - Oct 30 , 2024 | 12:07 AM

వనపర్తి మండలంలోని పెద్దగూడెం గ్రామంలో మా ర్కెట్‌ యార్డు మూతపడింది.

మూతపడ్డ మార్కెట్‌ యార్డు
పెద్దగూడెంలో మూతపడ్డ మార్కెట్‌ యార్డు

వనపర్తి రూరల్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): వనపర్తి మండలంలోని పెద్దగూడెం గ్రామంలో మా ర్కెట్‌ యార్డు మూతపడింది. గతంలో రోడ్డు నిర్వ హించే సంత వలన కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రెండేళ్ల క్రితం గ్రామ శివారులో గుట్టల్లో గ్రామ మార్కెట్‌ యార్డు నిర్మించి ప్రారంభిం చారు. కూరగాయలు, ఆకు కూరలు విక్రయించేందుకు దాదాపు 30కి పైగా గదులు నిర్మించారు. అప్పట్లో రెండు, మూడు వారాలు సంత అక్కడే కొనసాగిం చారు. గ్రామానికి కిలో మీటర్‌ దూరంలో మార్కెట్‌ ఉండటంతో ఎవరూ కూరగాయలు కొనుగోలు చేసేం దుకు రావడం లేదు. గిరాకీ రాకపోవడంతో మళ్లీ సంత మొదటికి వచ్చింది. నూతనంగా నిర్మించిన మార్కెట్‌ యార్డును వదిలి గ్రామంలోని బస్టాండ్‌ దగ్గర రోడ్డుపై సంత కొనసాగిస్తున్నారు. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన మార్కెట్‌ మూత పడింది. అధికారులు, గత పాలకులు ముందు చూ పు లేని కారణంగానే ప్రజాధనం వృథా అవుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Oct 30 , 2024 | 07:12 AM