Share News

సమగ్ర సర్వేను పక్కాగా నిర్వహించాలి

ABN , Publish Date - Nov 12 , 2024 | 10:56 PM

జిల్లా వ్యాప్తంగా సమగ్ర సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

సమగ్ర సర్వేను పక్కాగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్యాప్తంగా సమగ్ర సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కలు వివరాల సేకరణ కోసం నిర్వహిస్తున్న సమగ్ర సర్వే తీరును సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండలాల వారిగా ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లలో సర్వే పూర్తయిందని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు. రోజువారిగా నిర్వహించిన సర్వే వివరాలను సాయంత్రం ఐదు గంటల తర్వాత అప్‌డేట్‌ చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు నర్సింగరావు, లక్ష్మినారాయణ ఉన్నారు.

ధాన్యం సేకరణ సజావుగా సాగాలి

ఎర్రవల్లి : ధాన్యం పక్రియ సజావుగా కొనసాగాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ తెలిపారు. మంగళవారం అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులతో మాట్లడారు. గన్ని బ్యాగులు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని, కొనుగోలు వివరాలను ఏపీఎంఎస్‌లో నమోదు చేయాలని, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి స్వామికుమార్‌, జిల్లా మేనేజర్‌ విమల, అడిషనల్‌ డీఆర్డీవో నరసింహులు ఉన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 10:56 PM