Share News

కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Nov 11 , 2024 | 11:00 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
మరికల్‌లో సర్వే రికార్డులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే పర్ణికారెడ్డి

- మరికల్‌లో సర్వే పరిశీలన

మరికల్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన ఇంటింటి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మరికల్‌ మండల కేంద్రంలోని దత్తాత్రేయ కాలనీలో కొనసాగుతున్న కుటుంబ సర్వే ను ఆమె పరిశీలించారు సర్వేను ఏవిధంగా చేస్తు న్నారో, ఎన్యుమరేటర్లు సర్వే ఫామ్‌లో వివరాలు ఏవిధంగా నమోదు చేస్తున్నారో పరిశీలించి సం తృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌సుందర్‌రెడ్డి, సూర్యమోహన్‌రెడ్డి, వీరన్న, నరహరి, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆమె స్థానిక సూర్యచంద్ర ఫంక్షన్‌ హాల్‌లో మరికల్‌, ధన్వాడ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆడపడుచులకు పెద్దన్నగా వ్యవహరించి వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ సదాశివారెడ్డి, ధన్వాడ సింగిల్‌ విండో అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

లింగంపల్లిలో పత్తిమిల్లు తనిఖీ

నారాయణపేటరూరల్‌ : మండల పరిధిలోని లింగంపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ చిట్టెం పర్ణికారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిన్నింగ్‌ మిల్లర్ల అభ్యంతరాలపై చర్చించి సమస్యను పరిష్కరించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో పత్తి మార్కెట్లు, సీసీఐ కేంద్రాల వద్ద యధాతథంగా కొనుగోళ్లు జరుగుతాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట పేట మార్కెట్‌ చైర్మన్‌ సదాశివారెడ్డి తదితరులున్నారు.

బాల్యవివాహాలు జరిపిస్తే చట్టపరమైన చర్యలు

నారాయణపేట టౌన్‌ : బాల్య వివాహాలు జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో నారాయణపేట నియోజకవర్గ పరిధిలోని దామరగిద్ద, నారాయణ పేట మండలాలకు చెందిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మొత్తం 366 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డలను భా రంగా భావించొద్దని, వారిని ఉన్నత చదువులు చదివించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో రాంచందర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ చంద్రకాంత్‌, మార్కెట్‌ చైర్మన్‌ సదాశివారెడ్డి, వైస్‌ చైర్మన్‌ హన్మంతు, మునిసిపల్‌ వైస్‌ చైర్మెన్‌ హరినారాయణ్‌భట్టడ్‌, కౌన్సిలర్లు సలీం, మహేష్‌, బండి రాజేశ్వరి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 11:00 PM