వినతుల వెల్లువ
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:34 PM
గ ద్వాలకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు సమస్యల తో కూడిన వినతి పత్రాలు వెల్లువెత్తాయి.
- కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో సమస్యలు ఏకరువు
- ప్రజలకు అందుబాటులోనే కోర్టు ఉండాలి
- ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
- మన్మోహన్ సింగ్ మరణంతో అధికారిక కార్యక్రమం రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి
గద్వాల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ ద్వాలకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు సమస్యల తో కూడిన వినతి పత్రాలు వెల్లువెత్తాయి. శు క్రవారం జిల్లాలోని గట్టు మండలంలో అ ధికారిక కార్యక్రమంలో భాగంగా గద్వాలకు వచ్చారు. మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సిం గ్ మరణంతో కార్యక్రమాలు రద్దు అయ్యాయి. దీంతో డీకే బంగ్లాకు వచ్చిన ఆయ నకు జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్దారెడ్డి ఘ నంగా స్వాగతం పలికి మంత్రిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మంత్రిని కలిశారు. జిల్లా కోర్టును గద్వాల పట్టణంలోని పీజేపీలో నిర్మించాలని ఇందుకోసం సహకరించాలని వారు కోరారు. గద్వాలకు ఎని మిది కిలోమీటర్ల దూరంలో స్థలం చూపిస్తున్నారని, అది ఆమోదయోగ్యంగా లేదని వివరించారు. దీంతో మంత్రి సమాధానమిస్తూ ప్ర జలకు కోర్టు భవనం అందుబాటులో ఉండా లని, పీజేపీ.. లేదంటే పట్టణానికి సమీపంలోనే ఉండేవిధంగా అధికారులు పరిశీలన చేయాలని ఆయన సూచించారు. ఇందుకోసం సహకరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అ ధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డితో పాటు ఉపాధ్యాయులు వినతి పత్రం అందించారు. నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయాలని కోరారు. ఆ దాయ పన్ను మినహాయింపు పరిమితిని రెం డు స్లాబ్‌లలో రూ. ఐదు లక్షల వరకు పెంచాలని వారు కోరారు. జీవో నెంబరు 317 బాధిత ఉద్యోగ జేఏసీ నాయకుడు నరేష్‌కుమార్ మం త్రిని కలిసి సమస్యను వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48గంటల్లో 317 జీవో బా ధితులకు స్థానికత కల్పిస్తామని హామీ ఇచ్చా రని వివరించారు. కానీ ఏడాది గడిచినా న్యా యం జరగలేదని మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై తప్పక స్పందిస్తామని, న్యాయం జరిగే విధంగా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎగ్బోటే, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి, నాయకులు రామాంజనేయులు, కుమ్మరి శ్రీనివాసులు, రజక నర్సింహులు, త్యాగరాజు, బండల పాండు, రజక జయశ్రీ తదితరులు ఉన్నారు.