Share News

ప్రజల మన్ననలు పొందుతున్న ప్రభుత్వం

ABN , Publish Date - Dec 06 , 2024 | 11:45 PM

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు సహా అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మన్ననలు అందు కుంటోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మే ఘారెడ్డి అన్నారు.

ప్రజల మన్ననలు పొందుతున్న ప్రభుత్వం
నృత్యం చేస్తున్న యువతీ, యువకులు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు సహా అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మన్ననలు అందు కుంటోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మే ఘారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు 2024 సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మై దానంలో రాష్ట్రస్థాయి కళాకారులచే ప్రజా ప్రభుత్వం పిలిచింది పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాని కి కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఎమ్మెల్యే మేఘా రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో తెలంగా ణ పోరాట యోధులు, పోతురాజులు, బతు కమ్మ వంటి వాటిపై నృత్య ప్రదర్శనలు, ప్రజా ప్రభుత్వం పిలిచింది. ప్రజా పాలన వచ్చింది అనే అంశాలపై నాటికలను సుమారు 80 మంది కళాకారులు ప్రదర్శించారు.

Updated Date - Dec 06 , 2024 | 11:45 PM