ఘనంగా బతుకమ్మ సంబురాలు
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:11 PM
పాఠశాలలకు బుధవారం నుంచి దసరా సెలవుల నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు, పరిధిలోని వివిధ మండలాల్లోని పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యా యులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపు కున్నారు.
- పాఠశాలల్లో ఆడి పాడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు
నాగర్‌కర్నూల్ టౌన్/ఉప్పునుంతల/పెద్దకొత్తపల్లి/ కల్వకుర్తి టౌన్/ఊర్కొండ/వెల్దండ/అమ్రాబాద్/ కొల్లాపూర్, అక్టోబరు 1 : పాఠశాలలకు బుధవారం నుంచి దసరా సెలవుల నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు, పరిధిలోని వివిధ మండలాల్లోని పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యా యులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపు కున్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ పీజీ, డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు వివిధ రకాల పూలతో అలంకరించిన బతుకమ్మను కళాశాల ఆవరణలో ఉంచి ఆటపాటలతో సంబురాలు జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను కళాశాల ఆవరణలోని నీటి కొలనులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మహిళా అధ్యాపకులు వనిత, ఉమాదేవి, శైలజ, శాబేగం తదితరులున్నారు. అదేవిధంగా లిటిల్ ప్లవర్ హైస్కూల్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు డీఈవో గోవిందరాజులు హాజరై సంబురాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా, ఉప్పునుంతలలోని జడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మను తయారుచేసి ఆడి, పాడి సందడి చేశారు. హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, శ్యామ్‌సుందర్‌గౌడ్, ఉపాధ్యాయులు ఉన్నారు. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకార్పాముల ఉన్నత పాఠశాలతో పాటు, పెద్దకొత్తపల్లిలోని లిటిల్ బడ్స్ స్కూల్, చెన్నపురావుపల్లి ప్రాథమికోన్నత పాఠ శాలలో విద్యార్థినీ, విద్యార్థులు వివిధ రకాల పూలతో బతుకమ్మలు తయారుచేసి ఆడిపాడారు. విండో వైస్ చైర్మన్ మెరుగురాజు, ఎస్‌ఎంసీ చైర్మన్ వరలక్ష్మీ, హెచ్‌ఎం జియాఉద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ డాక్టర్ శర్వాణి ఆధ్వర్యంలో విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, ప్రత్యేక పూజల అనంతరం భక్తిపాటలతో విద్యార్థులు, అధ్యాపకులు బతుకమ్మలు ఆడారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్ట ర్ వాణి, మహిళా సాధికారిత కోఆర్డినేటర్ భాయ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఊ ర్కొండలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యా యులు వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారుచేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్‌ఎం ఆనంద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెల్దండలోని ప్రాథమిక పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాల, కొట్ర ఐకాన్ పబ్లిక్ స్కూల్‌లో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి బతుకమ్మలను పేర్చి ఆటలు ఆడారు. హెచ్‌ఎంలు పావని, శ్రీకాంత్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అమ్రాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, అధ్యాపకులు, ఉపాధ్యా యులు పాల్గొన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రైవేట్ పాఠశాలల(ట్రెస్మా) యాజమాన్యాల ఆధ్వర్యంలో మంగళవారం బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం నుంచి విద్యా ర్థులు పట్టణంలో బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. ఎన్‌టీఆర్ చౌరస్తాలో బొడ్డెమ్మలు, కోలాటాలతో బతుకమ్మ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యా యులు ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో నాగరాజు, కొల్లాపూర్ ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, గౌరవ అధ్యక్షుడు కారంచేడు రామా నుజం, జనరల్ సెక్రటరీ నయీమ్, ట్రెజరర్ శివకుమార్, కోశాధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.