Share News

ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:13 PM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు.

ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
మద్దూర్‌లో కులగణన ప్రక్రియను పరిశీలిస్తున్న రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెల్‌షాలం

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- జిల్లాలో ప్రారంభమైన కులగణన

నారాయణపేట రూరల్‌/నారాయణ పేట/ధన్వాడ/మద్దూర్‌/నర్వ/మాగనూరు/కృష్ణ/ఊట్కూరు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. బుధవారం పేట మండలంలోని జాజాపూర్‌ గ్రామంతో పాటు, ధన్వాడ మండల కేంద్రంలో జరుగుతున్న సర్వే తీరును క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ పరిశీలించారు. స్వయంగా సర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఎన్యుమరేటర్లు చేస్తున్న సర్వే ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె ఎన్యుమరేటర్లతో మాట్లాడి అనుమానాలపై ఆరా తీశారు. ఉదయం పది గంటలలోపు ప్రజలు ఇంటివద్దనే అందుబాటులో ఉంటారని అప్పుడు సర్వే చేపట్టాలని సూచించారు. ఈనెల 8వ తేదీ వరకు ఇళ్లను సందర్శించి స్టిక్కర్లు వేసి జాబితా రూపొందించాలని, 9వ తేదీ నుంచి సర్వేకు సంబంధించిన 75 అంశాలపై వివరాలను సేకరించాలన్నారు. ప్రజలు వివరాలు ఇచ్చేందుకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆధార్‌, రేషన్‌, ధరణి పట్టా పాస్‌బుక్‌లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పూర్తి వివరాలను నమోదు చేసి డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. సర్వే ఫారాలను భద్రంగా ఉంచుకోవాలన్నారు. జా జాపూర్‌లో డీఆర్‌డీవో మొగులప్ప, ఎంపీడీవో సుదర్శన్‌, ధన్వాడలో ఎంపీడీవో సాయిప్రకాష్‌, తహ సీల్దార్‌ సింధూజ, ఎంపీఈవో వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. నారాయణపేట మండలంలోని ఎక్లాస్‌పూర్‌ గ్రామంలో కొనసాగుతున్న ఇంటింటి సర్వేను జిల్లా ప్రణాళిక అధికారి ఎస్‌.యోగానంద్‌ పరిశీలించారు. మద్దూర్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెల్‌షాలం కులగణన ప్రక్రియను పరిశీలించారు. నాగిరెడ్డిపల్లిలో ఈడ్గి నర్సమ్మ అనే 93 ఏళ్ల వృద్ధురాలు తన ఆధార్‌కార్డును ఎన్యుమరేటర్లకు అం దించి, వివరాలు తెలిపింది. తహసీల్దార్‌ మహేశ్‌ గౌడ్‌, ఎంపీడీవో నర్సింహారెడ్డి, ఎంపీవో రామన్న, ఇతర అధికారులు సర్వేలో పాల్గొన్నారు. నర్వ మండల వ్యాప్తంగా 69 బ్లాకుల్లో 65 మంది సిబ్బందితో సర్వే ప్రారంభించినట్లు ఎంపీడీవో శ్రీనివాస్‌ తెలిపారు. దూర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు ఈనెలలో వీలైనప్పుడు వచ్చి గ్రామంలోని సంబంధిత బ్లాక్‌ అధికారులను సంప్రదించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మాగనూరుతో పాటు, కొత్తపల్లి, వర్కూరు, నేరడుగం తదితర గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి ఈశ్వర్‌రెడ్డి సర్వేను పరిశీలించారు. ప్రత్యేకాధికారి వెంట ఎంపీడీవో రహమతుద్దీన్‌, పంచాయతీ కార్యదర్శి నరసింహరెడ్డి, తిమ్మప్ప ఉన్నారు. కృష్ణ మండల కేంద్రంతో పాటు, ముడుమాల్‌ గ్రామంలో సర్వే ప్రక్రియను ఎంపీడీవో జానయ్య పరిశీలించారు. ఊట్కూర్‌ మండలం బిజ్వార్‌, మ గ్దూంపూర్‌ గ్రామాల్లో చేపట్టిన సర్వేను ఎంపీడీవో ధనుంజయ్‌గౌడ్‌ పరిశీలించారు.

Updated Date - Nov 06 , 2024 | 11:13 PM