Share News

వైద్యం కోసం వచ్చిన గర్భిణి మృతి

ABN , Publish Date - Dec 25 , 2024 | 11:49 PM

వైద్యం కోసం ప్రైవేట్‌ ఆసు పత్రికి వచ్చిన గర్భిణి మృతి చెందింది.

వైద్యం కోసం వచ్చిన గర్భిణి మృతి
ప్రైవేట్‌ ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు

- ప్రైవేట్‌ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు

- వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ

నాగర్‌కర్నూల్‌ క్రైం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : వైద్యం కోసం ప్రైవేట్‌ ఆసు పత్రికి వచ్చిన గర్భిణి మృతి చెందింది. వైద్యు డు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే అందుకు కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేప ట్టారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలం ఆలేరు గ్రామానికి చెందిన చెందిన రాము లమ్మ(25) మూడు నెలల గర్భిణి. వైద్యం కోసం బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వచ్చింది. అక్కడి వైద్యు డు లక్ష్మారెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచిం చారు. దీంతో కుటుంబ సభ్యులను ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో గర్భిణి బంధు వులు, కుటుంబ సభ్యులు ప్రైవేట్‌ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. అనంతరం రాస్తారోకో చేపట్టారు. రాములమ్మకు సకాలం లో వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేయ డం వల్లే ఆమె మృతి చెందిందని ఆరోపిం చారు. ఆసుపత్రి గుర్తింపును రద్దు చేసి, డాక్ట ర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశా రు. ఈ విషయంపై సమాచారం అందడంతో ఎస్‌ఐ గోవర్ధన్‌, సీఐ కనకయ్యలు అక్కడికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. సం ఘటనపై ఫిర్యాదు చేయాలని, కేసు నమో దు చేసి, దర్యాప్తు చేపడతామని చెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు. కాగా రాములమ్మకు షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్‌ చేసి నట్లు వైద్యుడు లక్ష్మారెడ్డి వివరణ ఇచ్చారు.

Updated Date - Dec 25 , 2024 | 11:49 PM