మతసామరస్యానికి ప్రతీక.. అబ్దుల్‌ఖాదర్ దర్గా
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:31 PM
జిల్లా కేంద్రంలోని హజ్రత్ సయ్య ద్ అబ్దుల్‌ఖాదర్ షా ఉర్సు శనివారం నుంచి ప్రారంభం కానుంది.
- నేటి నుంచి ఉర్సు, 29న గంధోత్సవం
- హాజరుకానున్న గుల్బర్గ పీఠాధిపతి
మహబూబ్‌నగర్ అర్బన్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని హజ్రత్ సయ్య ద్ అబ్దుల్‌ఖాదర్ షా ఉర్సు శనివారం నుంచి ప్రారంభం కానుంది. 86వ ఉర్సును పురస్కరిం చుకుని నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మత సామరస్యానికి ప్రతీకగా ఏటా నిర్వహించే వేడు కల్లో కుల, మతాలకతీతంగా ప్రజలు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఖాదర్‌షా మర ణానంతరం కుటుంబ సభ్యులు ఖాదర్‌షా ఆశ యాలను ఆచరణలో పెట్టేందుకు రాయచూర్ రోడ్డు పక్కనే నిర్మించిన ఆయన సమాధిపై దర్గా ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దర్గాను కుల, మతాలకతీతంగా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
గుసుల్ షరీఫ్‌తో ఉత్సవాలు ప్రారంభం
శనివారం గుసుల్ షరీఫ్, 29 సాయంత్రం నాలుగు గంటలకు గం ధోత్సవం షేక్‌బడేసాబ్ ఇంటి నుంచి బయలుదేరి అశోక్ టాకీస్ చౌరస్తా, ఎస్‌బీహెచ్ రోడ్డు, తూర్పు కమాన్, పోలీస్‌క్లబ్ నుంచి వన్‌టౌన్ గుండా దర్గాకు చేరుకుంటుంది. అక్కడ చాదర్ సమర్పించి ఫాతేహా అందజే స్తారు. 30న దీపారాధన, 31న ఫాతేహా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జామియ నిజామియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ముఫ్తి ఖలీల్ అహ్మద్, ముఫ్తి జియావుద్దీన్, కర్నూల్‌కు చెందిన తాహుర్‌ఖాద్రీ, హజ్రత్ ఇదాయతుల్లా, ముఫ్తి సైఫుల్లాఖాద్రీ వేడుకల్లో ముఖ్య అతిథు లుగా హాజరై ధార్మిక సందేశం ఇస్తారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, హైదరాబాద్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వేలాది భక్తు లు పాల్గొంటారు. భక్తులకు ఇబ్బందులు లేకుం డా ఏర్పాట్లు చేసినట్లు దర్గా ముతవల్లీ మహ్మద్ అబ్దుల్ జమీర్ తెలిపారు. శుక్రవారం మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ దర్గాను సందర్శించారు.