ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలి
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:27 PM
జిల్లాలో ఎయిడ్స్‌పై విస్తృతంగా ప్రచారం జరగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర పిలుపునిచ్చారు.
- జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర
మహబూబ్‌నగర్ (వైద్యవిభాగం) డిసెంబరు 2 : జిల్లాలో ఎయిడ్స్‌పై విస్తృతంగా ప్రచారం జరగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత డీఎఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎయిడ్స్ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోందని, దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్యశాఖ ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం ఎయిడ్స్ దినోత్సవంపై విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ, ఎయిడ్స్ నియంత్రణ జిల్లా అధికారి మల్లికార్జున్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శశికాంత్ పాల్గొన్నారు.
హన్వాడ : మండల కేంద్రమైన హన్వాడలో సోమవారం ఔమ్‌ఐఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ మండల కోఆర్డినేటర్ రాములు ఎయిడ్స్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు జంబులయ్య, నాయకులు రాజు, అంజమ్మ, వెంకటేష్, పద్మ పాల్గొన్నారు.