Share News

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

ABN , Publish Date - Nov 12 , 2024 | 11:45 PM

ప్రి యుడితో కలిసి భర్త రాత్లావ త్‌ రాజు(30)ను హత్య చేసిన ఘటనలో భార్య హిమబిందు, ప్రియుడు చంటి, అతని స్నే హితుడు కుర్ర రాజేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తర లిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ తెలిపారు.

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ

- భార్య హిమబిందుతో పాటు ప్రియుడు చంటి, మరొకరి రిమాండ్‌

- వివరాలు వెల్లడించిన ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌

నాగర్‌కర్నూల్‌ క్రైం, నవం బరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రి యుడితో కలిసి భర్త రాత్లావ త్‌ రాజు(30)ను హత్య చేసిన ఘటనలో భార్య హిమబిందు, ప్రియుడు చంటి, అతని స్నే హితుడు కుర్ర రాజేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తర లిస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ తెలిపారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, వెల్దండ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. వెల్దండ మండలం ఎంజీ తండాకు చెందిన రాత్లావత్‌ రాజు, అదే తండాకు చెందిన హిమబిందును తొమ్మిదే ళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఏడాదిగా హిమబిందు చంటి అనే వ్యక్తితో వివాహే తర సంబంధం పెట్టుకున్నది. ఈ విష యం రాజుకు తెలియడంతో ఈ నెల 5వ తేదీన భార్యను, ఆమె ప్రియుడు చంటిని మందలించాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాజును హత్య చేయాలని అత ని భార్య, ఆమె ప్రియుడు చంటి పథకం పన్నారు. వ్యవసాయ పొలం దగ్గర రాజు అతని భార్య మంచంపై పడుకుని ఉండ గా, చంటి, అతని స్నేహితుడు కొర్ర రాజేష్‌ పొలం దగ్గరికి వెళ్లారు. హిమ బిందును లేపుకుని పక్కకు వచ్చి తన దగ్గర తెచ్చుకు న్న సుత్తెతో నిద్రలో ఉన్న రాజు తలపై కొట్టాడు. నిద్రలో నుంచి లేచిన రాజు తిర గబడడంతో హిమబిందు, చంటి, స్నేహితు లు రాజేష్‌ కలిసి రాజు రెండు కాళ్లు పట్టు కోగా రాజు ముఖం, తలపై చంటి బలంగా కొట్టి చంపాడు. కొంచెం దూరం శవాన్ని తీసుకెళ్లి పడేశారు. మంచమంతా రక్తం కావడంతో మంచం కడిగి అక్కడే పెట్టి సుత్తె తీసుకుని చంటి అతని స్నేహితుడు రాజేష్‌లు వెళ్లిపోయారు. ఆ తర్వాత హిమబిందు తన భర్త కనిపించడం లేదని మృతుడి అన్న లాలూకు ఫోన్‌ చేసి చెప్పిం దని తెలిపారు. మృతుని తండ్రి రాత్లావత్‌ వాస్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశా రు. నిందితులను రిమాండ్‌కు తరలించా రు. ఈ సంఘటనపై కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విష్ణువర్‌రెడ్డి, ఎస్‌ఐ కురుమూర్తి, పోలీస్‌ సిబ్బంది ఆగమేఘాల మీద దర్యాప్తు చేసి నిందితులను పట్టుకో వడంతో ఎస్పీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ కురుమూర్తి, పోలీస్‌ సిబ్బంది కిశోర్‌రెడ్డి, మురళీకృష్ణ, జానకిరాం, ఆంజనేయులు, నవీన్‌యాదవ్‌, అమర్‌ సింగ్‌, సందీప్‌లను అభినందించారు.

Updated Date - Nov 12 , 2024 | 11:45 PM