తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
ABN , Publish Date - Nov 06 , 2024 | 11:35 PM
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ చెన్నారెడ్డి ఆదేశించారు.
- సమీక్షా సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ చెన్నారెడ్డి
మహబూబ్‌నగర్ నూటౌన్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ చెన్నారెడ్డి ఆదేశించారు. మహ బూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో మహబూబ్‌నగర్, నాగర్ కర్నూ ల్, నారాయణపేట జిల్లాల్లో నూతనంగా బాధ్య తలు చేపట్టిన ఏఈలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్‌ఈ జగన్ మోహన్, ఈఈ లు, డీఈలు, ఏఈలతో కలిసి తాగునీరు, పైప్ లైన్ల మరమతు, నీటి శుద్ధీకరణ తదితర అంశా లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏఈలు తమ పరిధిలోని గ్రామాల్లో క్రమం తప్పకుండా పర్యటించి, సమస్యలను గుర్తించాలన్నారు. వాటిని ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రతీ గ్రామానికి బ్లీచింగ్ పౌడర్‌ను పంపిణీ చేయాలన్నారు. 10 రోజులకోసారి వాటర్ ట్యాం కులను శుభ్రం చేసేలా గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించాలన్నారు. వాటర్ గ్రిడ్, వాట ర్ ఇంట్రాలో విధులు నిర్వర్తించే అధికారులకు వేర్వేరు బాధ్యతలు ఉంటాయని తెలిపారు. కొత్త గా ఉద్యోగంలో చేరిన వారు సీనియర్ అధికా రుల నుంచి పని విధానాన్ని తెలుసుకుని విధులు నిర్వర్తించాలని సూచించారు. పనిలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. అందరూ బాధ్యతా యుతంగా వ్యవహరించాలన్నారు. నారాయణ పేట, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామాల్లో పైప్‌లైన్ లీకేజీలకు వెంటనే మర మ్మతు చేపట్టాలని ఆదేశించారు. గతంలో సూచించిన పనులు చేయని అఽధికారులను మందలించారు. సమావేశంలో మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట ఈఈలు వెంకట్ రెడ్డి, సుధాకర్‌సింగ్, ఎం పుల్లారావు, రాంగారెడ్డి, రంగారావు పాల్గొన్నారు.