Share News

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Oct 22 , 2024 | 11:34 PM

చదువుతో పాటు క్రీడల్లో రాణిం చాలని వాలీబాల్‌ సంఘం జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చిన్న వీరయ్య అన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఉమ్మడి జిల్లా అండర్‌-19 బాల, బాలికల కబడ్డీ జట్లు

- జిల్లా వాలీబాల్‌ సంఘం ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చెన్నవీరయ్య

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, అక్టోబరు 22 (ఆంధ్రజోతి) : చదువుతో పాటు క్రీడల్లో రాణిం చాలని వాలీబాల్‌ సంఘం జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చెన్నవీరయ్య్డ అన్నారు. అడ్డాకుల మండలంలోని రాచాల జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో వచ్చేనెల నవంబర్‌ మూడు నుంచి ఐదవ తేదీ వరకు రాష్ట్ర స్థాయి అండర్‌-19 ఎస్‌జీఎఫ్‌ కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. అందులో పాల్గొనే ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలను మంగళవారం స్టేడియం మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల, కళాశాల స్థాయి నుంచే క్రీడల్లో రాణించాల న్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభను చాటి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌, ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 సెక్రటరీ పాపిరెడ్డి, వ్యాయమ ఉపాధ్యాయులు రమేష్‌బాబు, వడెన్న, యాద య్య, రాజవర్ధన్‌రెడ్డి, మేరీ పుష్ప పాల్గొన్నారు.

ఎంపికైన బాలురు, బాలికలు

బాలుర జట్టుకు పాండు, హరికృష్ణ, అంబరిష్‌, బాలక్రిష్ణ, ప్రవీణ్‌, నందకిశోర్‌, నవీన్‌నాయక్‌, బాలు, వంశీ, భాస్కర్‌, పవన్‌, విజయ్‌, అజయ్‌, బి.పవన్‌, చందు, నవీన్‌, వినోద్‌కుమార్‌, ఖాజా ఎంపికయ్యారు. బాలికల జట్టుకు మౌనిక, నవ నీత, సింధూజ, గంగ, కావేరి, పార్వతి, గాయత్రి, బి.గాయత్రి, సృజన, అనిత, జ్యోతి, సంగీత ఎంపికయ్యారు.

Updated Date - Oct 22 , 2024 | 11:34 PM