Share News

అమిత్‌షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి

ABN , Publish Date - Dec 24 , 2024 | 11:45 PM

కేంద్రమంత్రి అమిత్‌షాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

అమిత్‌షాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి
పేటలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకులు

- డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి

- పేటలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి అమిత్‌షాను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేడ్కర్‌ను అగౌర వపర్చేలా మాట్లాడటాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అమిత్‌షాకు వ్యతి రేకంగా నినాదాలు చేస్తూ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం అమిత్‌షా చిత్రపటాన్ని దహనం చేసి కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గందెఅనసూయ, వైస్‌ చైర్మన్‌ హరినారాయణ్‌భట్టడ్‌, మార్కెట్‌ చైర్మన్‌ సదాశివారెడ్డి, వైస్‌ చైర్మన్‌ కొనంగేరి హన్మంతు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ బండివేణుగోపాల్‌, 9వ వార్డు కౌన్సిలర్‌ మహేష్‌తో పాటు, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

బీఎస్పీ ఆధ్వర్యంలో...

నారాయణపేట : అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్‌షాను బర్తరఫ్‌ చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగెల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం నారాయణపేట అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టి ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్‌లో ఏవో జయసుధకు వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ రెండు ఒక్కటే అని, ఆ రెండు పార్టీలకు తేడా లేదన్నారు. అంబేడ్కర్‌ను ఒకసారి కాంగ్రెస్‌ అవమానిస్తే మరోసారి బీజేపీ అవమానిస్తోందన్నారు. అమిత్‌షా అంబేడ్కర్‌ను అవమానపరిచినా ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో చంద్రయ్య, వెంకటేష్‌, చంద్రశేఖర్‌, హన్మంతు, వెంకటయ్య, తిరుపతి, రమేష్‌, గౌతం, సయ్యద్‌ మహముద్‌, అజయ్‌, రాము, చెన్నయ్య, వీరన్న, రాజు, రవి, అరవింద్‌, బాల్‌రాజ్‌ ఉన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 11:45 PM