Share News

అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి

ABN , Publish Date - Dec 24 , 2024 | 11:59 PM

బీఆర్‌ అంబే డ్కర్‌ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను మంత్రి పదవి నుం చి తప్పించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డి మాండ్‌ చేశారు.

అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి
గద్వాల పట్టణంలోని ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకుల భారీ ర్యాలీ

గద్వాల టౌన్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ వేదికగా భారత రాజ్యాంగాన్ని అవ మానిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను మంత్రి పదవి నుం చి తప్పించాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డి మాండ్‌ చేశారు. మనువాద సంస్కృతి భావజా లంతో సమాజాన్ని పురోగమనంలోకి నడిపిస్తున్న బీజేపీ పాలకులకు అధికారంలో కొనసాగే నైతిక అర్హత లేదని ఆ పార్టీ నాయకులు నినాదాలు చే శారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం కేం ద్ర హోం మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని రాజీ వ్‌మార్గ్‌, పాతబస్టాండ్‌ సర్కిల్‌, సుంకులమ్మ మె ట్టు, కృష్ణవేణి సర్కిల్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌ మీదు గా ర్యాలీ కలెక్టరేట్‌ వరకు సాగింది. ర్యాలీలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సం పత్‌కుమార్‌, మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత, పీసీసీ కార్యవర్గ స భ్యుడు బి.శంకర్‌లతో కలిసి అంబేడ్కర్‌ విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి, హోం మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలో కాం గ్రెస్‌ శ్రేణుల నిరసన ర్యాలీ చేశాయి. ర్యాలీ సందర్భంగా కొద్దిసేపు ఆర్‌వోబీ రోడ్డులో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడగా ఆర్టీసీ బస్సులు, వాహనా లను అంబేడ్కర్‌ సర్కిల్‌, రెండవ రైల్వేగేట్‌, వేణుకాలనీ మీదుగా దారి మళ్లించారు. ర్యాలీలో జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిఽధులు, పార్టీ బాధ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2024 | 11:59 PM