Share News

అపూర్వ సమ్మేళనం

ABN , Publish Date - Sep 15 , 2024 | 11:20 PM

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1994-95 సంవత్స రం పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని సంజయ్‌ ఫాం హౌజ్‌లో జరుపుకున్నారు.

అపూర్వ సమ్మేళనం
సమ్మేళనమైన 1994-95 పూర్వ విద్యార్థులు

అపూర్వ సమ్మేళనం

దామరగిద్ద, సెప్టెంబరు 15 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1994-95 సంవత్స రం పదో తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని సంజయ్‌ ఫాం హౌజ్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా 30వ సంతాల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే చోట కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించారు. ఉపాధ్యాయులు సాయిరెడ్డి, శంభులింగం, జనార్దన్‌రెడ్డి, సతీష్‌గౌడ్‌, భగవంతురెడ్డి, పూర్వ విద్యార్థులు వెంకట్రామిరెడ్డి, శ్రీనివాస్‌, శశీధర్‌, జోషి పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 11:20 PM