Share News

దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Nov 23 , 2024 | 11:04 PM

దివ్యాంగులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని దివ్యాంగులు అన్నారు.

దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి
కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహిస్తున్న దివ్యాంగులు

- కలెక్టరేట్‌ ముందు దివ్యాంగుల ధర్నా

గద్వాల న్యూటౌన్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : దివ్యాంగులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని దివ్యాంగులు అన్నారు. శనివారం కలెక్టరేట్‌ ముందు ఏర్పాటు చేసిన దివ్యాంగుల ధర్నాకు అఖిలపక్ష నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకుల కుర్వ పల్లయ్య, నాగర్‌దొడ్డి వెంకట్రాములు మాట్లాడుతూ 11 నెలలుగా దివ్యాంగులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. దివ్యాంగులను ఆదుకున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. గ్యారెంటీల పేరుతో పింఛన్‌ రూ.ఆరు వేలకు పెంచుతామని, దివ్యాంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవో వీరభద్రప్పకు వినతి పత్రం అందజేశారు. నాయకులు అతికూర్‌ రహమాన్‌, రంజిత్‌, టవర్‌ మగ్బూల్‌, ఎమ్మార్పీస్‌ నాయకులు, దివ్యాంగులు ఉన్నారు.

Updated Date - Nov 23 , 2024 | 11:04 PM