చోరీలకు పాల్పడుతున్న దొంగల అరెస్టు
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:31 PM
జిల్లాలోని పలు మం డలాల్లో చోరీకు పాల్పడిన దొంగతలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వర రావు తెలిపారు.
వనపర్తి క్రైమ్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పలు మం డలాల్లో చోరీకు పాల్పడిన దొంగతలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వర రావు తెలిపారు. ఆదివారం ఎస్పీ కార్యాలయంలో విలేక రులతో మాట్లాడారు. ఈ నెల 23న ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో నారాయణదాసు వెంకటచారి తన బం గారం దుకాణానికి తాళం వేసి పని నిమిత్తం మహబూబ్‌నగర్‌కు వెళ్లాడు. ఈ నెల 24న బంగారం దుకాణం తాళాలు తీసి ఉండడాన్ని చూసిన ఆయన దుకాణంలోని బంగారు వెండి, వస్తువులు చోరీకి గురయ్యాయని గమనించి వెం టనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాఽ దితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కున్న ఎస్‌ఐ ఆదివారం ఖిల్లాఘణపూర్ బస్టాం డ్‌లో మన్యం అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. అదుపులోకి తీసుకొని విచా రించగా బంగారం దుకాణంలో చోరీకి పాల్పడ్డ ట్లు నిందితుడు మన్యం ఒప్పుకొన్నట్లు డీఎస్పీ తెలిపారు. అతని నుంచి 14 గ్రాముల బంగా రం, 615 గ్రాముల వెండి స్వాధీనం చేసుకుని రి మాండ్‌కు తరలించినట్లు చెప్పారు. అదే విధ ంగా పెబ్బేరు మండల కేంద్రంలో ఈ నెల 28న సంతలో శ్రీకాంత్ అనే వ్యక్తికి చెందిన సెల్‌ఫో న్‌ను గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కున్న పోలీసులు ఆదివారం పెబ్బేరు బస్టాండ్ లో అనుమానాస్పదంగా ఆటోలో ఉన్న ఆంధ్రప్ర దేశ్‌కు చెందిన నలుగురు లక్ష్మి, దుర్గారావు, లక్ష్మ ణ్, మైలపోగు సాగర్ బా బు, షేక్ బాబులు అ దుపులోకి తీసుకుని విచా రించగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్యాంగ్‌గా ఏర్పడి చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితు లు నేరం ఒప్పుకొ న్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి ఒక ఆటో, పెబ్బేరు సంతలో చోరీ చేసిన సెల్‌ఫోన్‌తో పాటు మరో సెల్‌ఫోన్ స్వాధీనం చే సుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అదే విధంగా నవంబర్ నెలలో గోపాల్‌పేట మ ండలం ఏదుట్లలో వెంకటయ్య, వెంకటరమణ అన్నదమ్ములకు చెందిన 50 పందులను గుర్తు తెలియని దొంగలు దొంగిలించారు. బాధితులు గోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆ దివారం ఉదయం గోపాల్‌పేట మండల కేంద్రం లో అనుమానాస్పదంగా తిరుగుతున్న గద్వాల జిల్లా అయిజ మండలం బింగిదొడ్డికి చెందిన ఎ రుకలి ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నా రు. అతనిని విచారించగా నవంబరు నెలలో పందులను బొలెరో వాహనంలో కర్నూల్ జిల్లా కు చెందిన బాల్‌రాజ్‌తో కలిసి చోరీ చేసినట్లు నే రము ఒప్పుకొన్నాడు. అదే విధంగా పెద్దమందడి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక దొంగతనం చేశామని నిందితుడు ఒప్పుకొన్నాడని డీఎస్పీ తె లిపారు. ప్రస్తుతం ఆంజనేయులును రిమాండ్‌కు తరలిస్తున్నామని, బాలరాజు పరారీలో ఉన్నాడ ని, అతనిని కూడా పట్టుకుంటామని డీఎస్పీ తెలి పారు. ఈ కేసులు ఛేదించిన ఆయా మండలాల ఎస్‌ఐలను ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.