Share News

రూ.3 కోట్లతో ఆడిటోరియం

ABN , Publish Date - Nov 12 , 2024 | 11:42 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలో రూ.3 కోట్లతో ఆడిటోరియం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

రూ.3 కోట్లతో ఆడిటోరియం
క్రీడాజ్యోతితో పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- డివిజన్‌ స్థాయి ఆటల పోటీలు ప్రారంభించిన మంత్రి జూపల్లి

కొల్లాపూర్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి):నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలో రూ.3 కోట్లతో ఆడిటోరియం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ నెల 27, 28, 29వ తేదీలలో నిర్వహించనున్న ఆర్‌ఐడీ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాల వారోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం కొల్లాపూర్‌ మినీ స్టేడియంలో నిర్వహించిన డివిజన్‌ స్థాయి ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాజ్యోతి వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన క్రీడాకారులను, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. త్వరలోనే కొల్లాపూర్‌ పట్టణంలో ఆడిటోరియం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఆర్‌ఐడీ ఉన్నత పాఠశాల, కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళ నానికి దేశ విదేశాల నుంచి పూర్వ విద్యార్థులు హాజరవుతున్నారని తెలి పారు. క్రీడాకారులు క్రీడల్లో రాణించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించాలని సూచించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల నుంచి డిగ్రీ కళాశాల వరకు మినీ స్టేడియంలో నిర్వహించిన డివిజన్‌ స్థాయి ఆటల పోటీలలో విద్యా ర్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐడీ పూర్వ విద్యార్థుల వారోత్సవాల కమిటీ అధ్యక్షుడు డాక్టర్‌ సాయిప్రసాద్‌, రిటైర్డ్‌ డీఆర్‌వో కటికనేని మధుసూదన్‌ రావు, రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ దివాకర్‌ రావు, కొల్లాపూర్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మేకల రమ్య, ఎంఈవో తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 11:42 PM