Share News

వ్యాసెక్టమీపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Nov 20 , 2024 | 10:55 PM

అర్హులైన మగ వారికి ఉచితంగా ఈనెల 28 నుంచి డిసెంబరు 4 వరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాసెక్టమీపై ఆపరేషన్‌ నిర్వహిస్తారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సిద్ధప్ప అన్నారు.

వ్యాసెక్టమీపై అవగాహన కల్పించాలి
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ సిద్దప్ప

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ సిద్దప్ప

గద్వాల న్యూటౌన్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన మగ వారికి ఉచితంగా ఈనెల 28 నుంచి డిసెంబరు 4 వరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాసెక్టమీపై ఆపరేషన్‌ నిర్వహిస్తారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సిద్ధప్ప అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో డీఎంహెచ్‌వో కార్యాలయంలో వైద్య సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుధవారం నుంచి ఈనెల 27 వరకు వైద్యసిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది కుటుంబ నియంత్రణలో భాగంగా అర్హులైన మగ వారికి వ్యాసెక్టమీపై ఆపరేషన్‌ గురించి అవగాహన కల్పించాలన్నారు. వ్యాసెక్టమీపై ఆపరేషన్‌లో కోత, కుట్టు ఉండదని, ఇది చాలా సులువైన కుటుంబ నియంత్రణ అన్నారు. అలాగే ఇతర ఆరోగ్య కార్యక్రమాల్లో భాగంగా అనుమానిత క్షయ వ్యాధిగ్రస్తులను గురించి వారికి పరీక్షలు నిర్వహించి క్షయవ్యాధి నిర్ధారణ అయితే వెంటనే వారికి చికిత్సలు నిర్వహించాలన్నారు. వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నప్పుడు అనుమానిత కుష్టు వ్యాధిగ్రస్థులను గుర్తిస్తే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎన్‌సీడీ ప్రోగ్రాంలో భాగంగా బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు అందించాలన్నారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు రాజు, ప్రసూనరాణి, రిజ్వానా తన్వీర్‌ ఉన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 10:55 PM