Share News

అయ్యప్ప శరణుఘోష

ABN , Publish Date - Dec 25 , 2024 | 11:51 PM

మహ బూబ్‌నగర్‌ పట్టణంలోని పద్మావతి కాలనీలో గల అయ్యప్పకొండపై బుధ వారం 27వ వార్షిక అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు.

అయ్యప్ప శరణుఘోష
మహబూబ్‌నగర్‌లో అయ్యప్ప స్వాముల శోభాయాత్ర

- ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

- భక్తిపాటలు, భజనలతో పరవశించిన అయ్యప్పస్వాములు

- ట్రాఫిక్‌ను దారి మళ్లించిన పోలీసులు

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మహ బూబ్‌నగర్‌ పట్టణంలోని పద్మావతి కాలనీలో గల అయ్యప్పకొండపై బుధ వారం 27వ వార్షిక అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం ప్రభాతసేవ, గణపతిహో మం, అయ్యప్పస్వాములు రక్తదాన శి బిరం నిర్వహించారు. అనంతరం వన్‌ టౌన్‌ సమీపంలోని తూర్పుకమాన్‌ వ ద్ద నుంచి పూజలు నిర్వహించిన అ య్యప్పస్వాములు 18 కలశాలతో శో భాయాత్ర నిర్వహించారు. యాత్ర రామ్‌మందిర్‌ చౌరస్తా, గడియారం చౌరస్తా, అశోక్‌ టాకీస్‌ చౌరస్తా, ఫారెస్ట్‌ కార్యాలయం, పాత కలెక్టరేట్‌, న్యూటౌన్‌ చౌరస్తా, మెట్టుగడ్డల మీదుగా అయ్యప్పకొండకు చేరుకుంది. పట్టణంలో శోభాయాత్ర నిర్వహిస్తున్న ప్రాంతంలో స్థా నిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహిం చారు. అయ్యప్ప కరుణతో పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ పాల్గొని అయ్యప్పస్వామికి పూజ లు నిర్వహించారు. ఊరేగింపులో అయ్యప్పస్వాములు భక్తిపాటలు, భజనలు, కీర్తనలు పాడి పరవశం చెందారు. పెద్ద ఎత్తున బా ణసంచా కాల్చారు. శోభాయాత్రలో వేలాదిగా అయ్యప్పస్వాములు పాల్గొన్నారు. శోభాయాత్ర నిర్వహిస్తున్న దారిలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా వన్‌టౌన్‌ ఎస్‌ఐ శ్రీనయ్య వాహనాలకు దారిమళ్లిం చారు. అయ్యప్పకొండకు చేరాక అయ్యప్ప స్వాములు స్వామికి పు ష్పాభిషేకం నిర్వహించారు. ఎంపీ డీకే అరుణ, ఏపీ మిథున్‌ రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌, అయ్యప్పసే వా సమా జం సభ్యులు, స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 11:51 PM