Share News

కాలకేయుడిని చంపినోడే బాహుబలి

ABN , Publish Date - Jan 24 , 2024 | 11:01 PM

‘పాలమూరులో రాక్షస పాలన ముగిసింది. ప్రజా పాలన మొదలైంది. ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. కాలకేయుడిని చంపినోడే బాహుబలి’అని సీడబ్ల్యూసీ ఆహ్వానితుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జేజేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కార్యక్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

కాలకేయుడిని చంపినోడే బాహుబలి
సమావేశంలో మాట్లాడుతున్న వంశీచంద్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, జనవరి 24: ‘పాలమూరులో రాక్షస పాలన ముగిసింది. ప్రజా పాలన మొదలైంది. ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు. కాలకేయుడిని చంపినోడే బాహుబలి’అని సీడబ్ల్యూసీ ఆహ్వానితుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జేజేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కార్యక్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అధ్యక్షత వహించారు. వంశీచంద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్లుగా పాలమూరు ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడిపారని, వ్యాపారం చేసుకుందామన్నా భయపడేవారన్నారని చెప్పారు. గత పాలనలో భూకబ్జలతో పాటు బెదిరింపులకు పాల్పడేవారన్నారు. ఇప్పుడు అవన్నీ పోయి, ప్రజలు ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారన్నారు. మహబూబ్‌నగర్‌లో త్వరలోనే రూ.15 కోట్లతో క్రికెట్‌ మైదానం ఏర్పాటుకు బీసీసీఐతో మాట్లాడినట్లు తెలిపారు. పార్లమెంట్‌ నియోజకవ్గంలో రూ.1,000 కోట్లతో పార్లేజీ బిస్కెట్‌ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని, పాలమూరులో అరాచక శక్తుల ఆటలు సాగవన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ మూలాలు లేకుండా చేస్తామన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కేసీఆర్‌, కేటీఆర్‌, మాజీ మంత్రులు తట్టాబుట్ట సర్దుకొని దిక్కులేని చోటకు వెళ్లడం ఖాయమన్నారు. బీఆర్‌ఎ్‌సను ఓడించామని, బీజేపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ నాయకులు తనకు నిత్యం ఫోన్‌ చేసి, కాంగ్రె్‌సలో చేరతామని అడుగుతున్నారన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో వంశీచంద్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలిపిచాలన్నారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. పార్లమెంట్‌ స్థానాన్ని గెలిపించి, సీఎంకు కానుకగా ఇద్దమని మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి మాట్లాడుతూ తర్వలోనే భూ భకాసురుల భరతం పడామన్నారు. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి తీసుకోమన్నారు. సమావేశంలో ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2024 | 11:01 PM