Share News

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

ABN , Publish Date - Oct 01 , 2024 | 11:02 PM

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ సంబురాలు అని ఎమ్యెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

- ఎమ్యెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

- చిట్టెం నర్సిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాఠశాలల్లో బతుకమ్మ ఆడిన విద్యార్థులు

నారాయణపేట/రూరల్‌/మక్తల్‌రూరల్‌/కొత్తపల్లి/కోస్గి, అక్టోబరు 1 : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ సంబురాలు అని ఎమ్యెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రన్సిపాల్‌ మెర్సి వసంత అధ్యక్షతన బతుకమ్మ సంబురాలు నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. తెలంగాణ పేరు చెప్పగానే బతుకమ్మ పండుగ గుర్తుకు వస్తోందన్నారు. ఇంది దేశంలోనే అరుదైన పూల పండుగ అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శివారెడ్డి, వైస్‌ చైర్మన్‌ కొనంగేరి హన్మంతు, కౌన్సిలర్లు శిరీస చెన్నారెడ్డి, ఎండీ సలీం, మహేష్‌కుమార్‌, మాజీ మార్కెట్‌ చైర్మన్లు బండి వేణుగోపాల్‌, సరాఫ్‌ నాగరాజ్‌, సుధాకర్‌, సింగిల్‌ విండో డైరెక్టర్‌ మల్లేష్‌ పాల్గొన్నారు. అదే విధంగా మండలంలోని జాజాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థుల వివిధ రకాల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఆడిపాడారు. కార్యక్రమంలో హెచ్‌ఎం భారతి, ఉపాధ్యాయులు విజయ, మధుసూదన్‌, భానుప్రకాశ్‌, లక్ష్మణ్‌, ప్రతాప్‌, నరసింహ, శశిరేఖ,మంగళ, నిర్మల, శ్రీదేవి, శిరీష పాల్గొన్నారు.

మక్తల్‌ మండలం కాచ్‌వార్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి ఆట పాటలతో సందడి చేశారు. అనంతరం గ్రామ సమీపంలోని చెరువు వరకు ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్ఞనం చేశారు. హెచ్‌ఎం నిర్మల, ఉపాధ్యాయురాలు అనిత, అంగన్వాడి టీచర్లు నవీన, లక్ష్మి, ఆయాలు పాల్గొన్నారు.

కొత్తపల్లి మండలం భూనీడు, నిడ్జింత జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో ఎంఈవో ఆంజనేయులు, హెచ్‌ఎం చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు.

కోస్గి మండలం నాచారం ప్రభుత్వ పాఠశాల, మీర్జాపూర్‌ ప్రభుత్వ పాఠశాల, పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాలు కనుల పండువగా జరుపుకున్నారు. నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు కావడంతో ముందస్తుగా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకున్నారు. అనంతరం దగ్గరలోని చెరువులో నిమజ్జనం చేశారు.

Updated Date - Oct 01 , 2024 | 11:02 PM