Share News

జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలవాలి

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:35 PM

జాతీయ స్థాయి కబడ్డీ టోర్నీలో రాష్ట్ర జట్టు విజేతగా నిలవాలని ఏఎంవో దుంకుడు శ్రీని వాస్‌ అన్నారు.

జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలవాలి
మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్న రాష్ట్ర జట్టు క్రీడాకారులతో ఏఎంవో దుంకుడు శ్రీనివాస్‌

- ఏఎంవో దుంకుడు శ్రీనివాస్‌

- మధ్యప్రదేశ్‌కు బయలు దేరిన రాష్ట్ర జట్టు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, నవంబరు 14 : జాతీయ స్థాయి కబడ్డీ టోర్నీలో రాష్ట్ర జట్టు విజేతగా నిలవాలని ఏఎంవో దుంకుడు శ్రీని వాస్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిం చనున్న జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌ - 17 బాలికల కబడ్డీ టోర్నీలో పాల్గొనే బాలి కల జట్టు తరలివెళ్లింది. ఈ సందర్భంగా గురువారం మహబూబ్‌నగర్‌ పట్టణంలోని బాలుర కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాస్‌ మాట్లాడుతూ చదు వుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారు లకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలి పారు. జాతీయ స్థాయి టోర్నీలో ప్రతిభ చాటాలని, క్రీడా కోటాలో ఉన్నత, ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ అండర్‌-17 సెక్ర టరీ శారదాబాయి, అండర్‌-19 సెక్రటరీ పాపిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా అఽధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్‌, పీడీ రాజవర్ధన్‌రెడ్డి, మేనేజర్‌, కోచ్‌ శివాని, కురుమయ్య పాల్గొన్నారు.

తెలంగాణ బాలికల జట్టు

బాలికల జట్టులో నందిని, శివమణి, గంగ, కావేరి (మహబూబ్‌నగర్‌), సొనాలి, సాత్విక (ఆదిలాబాద్‌), హనీ, మిస్ర్తీ (ఖమ్మం), హప్సా, పూజ (నల్గొండ), సాక్షి (రంగారెడ్డి), వందన (కరీంనగర్‌) ఉన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:35 PM