Share News

ఏటీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:22 PM

నగదు విత్‌డ్రా కోసం ఏటీఎంల వద్దకు వెళ్లే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని పేట సీఐ శివశంకర్‌ అన్నారు.

ఏటీఎంల వద్ద అప్రమత్తంగా ఉండాలి
మక్తల్‌లో బ్యాంకు వద్ద ఖాతాదారులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి

నారాయణపేట న్యూటౌన్‌/మక్తల్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): నగదు విత్‌డ్రా కోసం ఏటీఎంల వద్దకు వెళ్లే ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని పేట సీఐ శివశంకర్‌ అన్నారు. మంగళవారం నారాయణపేటలోని ఎస్‌బీఐ, యూనియన్‌, కెనరా బ్యాంకుల పరిసరాల్లో ఉన్నవారిని ఫింగర్‌ ప్రింట్స్‌, డివైస్‌తో అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ బ్యాంకు ఖాతాదారులకు పలు సూచనలు చేశారు. ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా, మక్తల్‌లోని ఎస్‌బీఐ, హెచ్‌డీ ఎఫ్‌సీ బ్యాంకుల వద్ద మక్తల్‌ ఎస్సై భాగ్యలక్ష్మీ రెడ్డి ఖాతాదారులకు బ్యాంకు లావాదేవీలపై అవగాహన కల్పించారు. బ్యాంకు నుంచి నగదు ఇంటికి తీసుకెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించా లని, అపరిచితుల మాటలను నమ్మవద్దన్నారు.

Updated Date - Nov 05 , 2024 | 11:22 PM