ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:27 PM
మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేం ద్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని డీఎంహెచ్‌వో శ్రీనివాసులు తెలిపారు.
- డీఎంహెచ్‌వో శ్రీనివాసులు
ఖిల్లాఘణపురం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేం ద్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని డీఎంహెచ్‌వో శ్రీనివాసులు తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో బుధవారం కొత్తగా కేటాయించిన 102 వాహనాన్ని డీఎంహెచ్‌వో, పీఏసీఎస్ చైర్మ న్ మురళీధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సం దర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి 102 వా హనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రతి రోజు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 200 మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మ న్ క్యామ రాజు, సీహెచ్‌సీ ఆసుపత్రుల సూప ర్‌వైజర్ చైతన్య, సూపరింటెండెంట్ పుల్లారెడ్డి, వైద్యులు రాఘవులు, సిబ్బంది పాల్గొన్నారు.